Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తుంది. దీంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతూ అందరినీ అలరిస్తుంది. ఇక ఈరోజు మార్చి 7  ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో నీకేమీ తెలియకుండా మాట్లాడకు వాళ్ళు తెలియకుండానే టాబ్లెట్స్ వేస్తున్నారు అంటుంది కృష్ణ. డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాయకుండా వీళ్లు ఎందుకు వేస్తారు అంటుంది ముకుంద. మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అయినా నేను నిజం చెప్తున్నాను మావయ్య ఇంత డోస్ టాబ్లెట్ వేస్తే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కృష్ణ.

ముకుందని జోక్యం చేసుకోవద్దు అంటున్నావ్ కానీ నందిని విషయంలో నువ్వే ఎక్కువగా జోగించేసుకుంటున్నావు అంటాడు మురారి తండ్రి. తను చెప్పింది అంటే కచ్చితంగా నిజమే అయి ఉంటుంది డాడీ అంటాడు మురారి. మేము సీనియర్ డాక్టర్ల సలహాలతోనే ఈ టాబ్లెట్లు వాడుతున్నాము మీ ఆవిడని నందిని గురించి పట్టించుకోవద్దు అని చెప్పు అంటుంది భవాని.

ఇలాంటి పవర్ఫుల్ మందులు వేస్తే దారుణమైన ఎఫెక్ట్లు చూపిస్తాయి అంటుంది కృష్ణ. కృష్ణకి ముందుగా వాదించడం బాగా అలవాటైపోయింది. ఇంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నా తనకే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది అంటుంది ముకుంద. నిజంగానే పట్టింపు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను తన హెల్త్ మీకెంతో నాకు అంతే ఈ టాబ్లెట్స్ వేయడానికి నేను ఒప్పుకోను అంటుంది కృష్ణ.

నువ్వు ఒప్పుకునేదేంటి ఆ టాబ్లెట్ ఎటు ఇవ్వు నేను వేస్తాను అంటుంది భవాని. ఆమెకి ఎదురుగా వెళ్లి ఇక్కడ మీ మాటే చెల్లాలి అని పంతం పెట్టుకుంటే కుదరదు, కావాలంటే వేరే ఏ డాక్టర్ కైనా ఆ టాబ్లెట్ చూపించండి. ఈ టాబ్లెట్ మెదడుని స్తబ్దుగా మారుస్తుంది. దీనివల్ల నందిని రోజు రోజుకి కృషించిపోతుంది మీకు అర్థం కావట్లేదా.

ఇలాగే కంటిన్యూ అయితే నందిని ఎప్పటికీ మామూలు మనిషి కాలేదు, స్లో పాయిజన్ ఇస్తున్నారు అంటుంది కృష్ణ. ఇంట్లో ఏసిపి ఉన్నాడు కదా హత్య ప్రయత్నం కింద కేసు పెట్టు అంటుంది ముకుంద. తనని అంత తేలిగ్గా తీసి పారేయకు, ఎంబిబిఎస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది తనకి అంటూ భార్యని వెనకేసుకొస్తాడు మురారి. నా ముందే నా భార్యని అంత చీప్ గా మాట్లాడితే నేను ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు మురారి.

మావన్ని వానకాలం చదువులు మరి ఈ టాబ్లెట్స్ రాసిన డాక్టరు నీ భార్యకి చులకనగా కనిపిస్తున్నారా, రేవతి ని ఏమైనా అంటే తను వెనకేసుకొచ్చింది పెద్ద తేని ఏమైనా అంటే నేను వెనకేసుకు రావాల్సి వస్తుంది, అయినా తనకి ఎంత ధైర్యం పెద్దత్తయ్య మీద కేకలు వేయటానికి, ఒక డాక్టర్ కన్నా తల్లి కన్నా తనకే ఎక్కువ తెలిసిపోతుందా అంటుంది ముకుంద.

ఇంట్లో ఇప్పటివరకు నేను గాని మా అక్క గాని మగవాళ్ళని ఒక్క మాట అనలేదు అలాంటిది నువ్వు నా కొడుకుని అంటావేంటి నువ్వు కూడా నీ హద్దుల్లో ఉండు అంటుంది రేవతి. నందిని తన గదిలోకి వెళ్లి పడుకోమంటుంది కృష్ణ మళ్లీ వీళ్ళందరూ వస్తారేమో అంటే ఎవరు వచ్చినా తలతీయుకు గడి పెట్టుకొని పడుకో అంటూ ఆమెని పంపించేస్తుంది కృష్ణ.

రేపు నేను ప్రసాద్,నందినిని హాస్పిటల్ తీసుకొని వెళ్తాము అంటుంది భవాని. నందిని బాధ చూడలేక కొంచెం గట్టిగా మాట్లాడాను క్షమించండి అంటూ నందిని బాధ నాకు అర్థమైంది మీ ఇప్పటివరకు మీరు వాడుతున్న టాబ్లెట్లు వల్ల మెదడు మొద్దు బారి పోయింది. తనకి నేను నయం చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అంటుంది కృష్ణ.

నీ వల్ల ఏమవుతుంది అని ప్రసాద్ అంటే నందిని క్షేమం కోరుకునే వాళ్లే అయితే దయచేసి ఎవరు అడ్డు రాకండి, వారం పది రోజుల్లోనే తన ఆరోగ్యం బాగోయేలాగా చేస్తాను చాలా అంటుంది కృష్ణ. తనమీద నాకు నమ్మకం ఉంది బాబాయ్ అంటూ భార్యని వెనకేసుకొస్తాడు మురారి. మరోవైపు భవాని దగ్గరికి వచ్చి మాకు చాలా టెన్షన్ గా ఉంది.

మీరు ఇంకా ఎంత టెన్షన్ పడుతున్నారో అంటారు ఈశ్వర్, ప్రసాద్. నందిని విషయంలో చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది కృష్ణ ఏం చేద్దాం అంటాడు ఈశ్వర్. తనని కంట్రోల్ చేద్దాం అనుకున్న మురారి వెనకేసుకొస్తున్నాడు, వాలెంటైన్స్ డే రోజు నందిని సిద్దు ని గుర్తు చేసుకుంది అదే కృష్ణ మనసులో రిజిస్టర్ అయిపోయి నందిని తరఫున గట్టిగా మాట్లాడుతుంది అంటుంది భవాని.

ఆరోజు నందిని కి గతం గుర్తొచ్చిందేమో అని చాలా భయపడ్డాను అంటాడు ప్రసాద్. కృష్ణ నెమ్మదిగా నందిని మామూలు మనిషిని చేస్తానంటుంది అప్పుడు ఎలా అనేది అర్థం కావట్లేదు అంటాడు ప్రసాద్. నందిని ఆరోగ్యాన్ని మెరుగుపర్చిన ఆమె ఘతాన్ని తవ్వకుండా ఉంటే చాలు లేదంటే ఇంటిగుట్టు అంతా బయటపడుతుంది అని కంగారుపడుతుంది భవాని.

నా కుటుంబం పరువు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటుంది. మరోవైపు పెద్దవాళ్లు ఎందుకలా అంటుంది కృష్ణ, పెద్దరికం అంటాడు మురారి. నేను వదలను నందిని కి నయం చేస్తాను, అది పిచ్చి కాదు మానసిక ఒత్తిడి మందులు మారుస్తాను అంటుంది కృష్ణ. గొడవలవుతాయేమో అంటాడు మురారి. నందిని కన్నా గొడవలు ఎక్కువ కాదు అంటుంది కృష్ణ.

కీప్ ఇట్ అప్ అంటాడు మురారి. మరోవైపు ఆలోచనలో ఉన్న కృష్ణ గౌతమ్ సార్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి నందిని విషయంలో హెల్ప్ అడగాలి, ఎలాగైనా నందిని విషయంలో గౌతమ్ సార్ తో మాట్లాడాలి అనుకుంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన రేవతి నీకు ఒంట్లో బాలేదు అన్నావు కదా రెస్ట్ తీసుకో అంటుంది.

కూరగాయలు కట్ చేసి వెళ్ళిపోతాను అంటే వద్దమ్మా ఇక్కడ పనిచేసి హాస్పిటల్లో పనిచేసి అలసిపోతే మళ్ళీ నీరసం వస్తుంది అంటుంది రేవతి. భవాని అక్క మీ ఇంటికి రాజమాత తన విషయంలో నువ్వు ఎదురెళ్లొద్దు అంటుంది రేవతి. నందిని విషయంలోనే కథ చెబుతున్నారు అంటుంది కృష్ణ. అవునమ్మా కూతుర్ని మహారాణి లాగా పెంచింది అలాంటిది తనే ఎందుకు ఆరోగ్యం పాడయ్యే టాబ్లెట్స్ వేస్తుంది చెప్పు.

ఆమెకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ సామాన్యుడేమీ కాదు అంటుంది రేవతి. అది నిజమే కానీ నందిని కి ఏమైంది ఎందుకు ఆ టాబ్లెట్లు వాడుతున్నారు అంటే మౌనంగా ఉంటుంది రేవతి. నేను నేరుగా నందిని ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకుంటాను అనుకుంటుంది కృష్ణ. పెద్ద అత్తయ్య నిర్ణయానికి ఎదురెళ్లను కానీ నందిని పూర్తిగా బాగా అయ్యేవరకు నేను కూడా వెనకడుగు వేయను ఎందుకంటే అది నా బాధ్యత అంటుంది కృష్ణ.

ఇన్నాళ్లు వాళ్లు చేసిన తప్పుని ఎదిరించలేక నందిని విషయంలో ఏం చేయలేక ఎన్నోసార్లు బాధపడ్డాను. నేను తీసుకో లేకపోయినా బాధ్యతని నువ్వు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది అనుకుంటుంది రేవతి. మురారి కి వచ్చిన కలలో కృష్ణ వచ్చినట్లుగా వచ్చి మాయమైపోతుంది. అప్పుడే కాఫీతో వచ్చిన కృష్ణని చూసి కలా, నిజమా అంటాడు.

ఇది నిజమే కాకపోతే కాఫీలో వేలు పెట్టి చూడండి అంటుంది కృష్ణ. కృష్ణని గిచ్చి ఆమె కేక పెడితే నిజమే అంటాడు మురారి మీరే గిచ్చుకోవచ్చు కదా అని కృష్ణ అంటే నేను రిస్కులు తీసుకోను అంటూ నవ్వుతాడు మురారి. నీకు కల వచ్చిందా అంటూ కల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణ దంపతులు ఇవన్నీ బయటనుంచి చేస్తున్న ముకుంద కోపంతో ఉడుక్కుంటుంది.

మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేను ఉండను అంటుంది ముకుందా ఎందుకు నేను డ్రాప్ చేస్తాను కదా అని మురారి అంటే మీరే కదా నాకు ధైర్యం చెప్పారు. వేస్తాను అదే ధైర్యంతో నందినిని కూడా బాగు చేస్తాను అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో పానీ పూరి మీకు ఒకటి నాకు ఒకటి అంటూ తింటూ ఉంటారు కృష్ణ దంపతులు. మధ్యలో ముకుంద వచ్చి తను కూడా చేయి పడుతుంది.