చారిత్రక నేపథ్యమున్న కథలపై దర్శకుడు క్రిష్ దృష్టి తక్కువ బడ్జెట్ తో ఎక్కువ అవుట్ పుట్ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ పై స్టార్ హీరోల దృష్టి
తెలుగులో అగ్ర దర్శకులుగా వెలుగుతున్న వాళ్లంతా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. కానీ.. వాళ్లు చారిత్రక కథలను మాత్రం టచ్ చేయడంలేదు. చిన్న చిత్రాలను రూపొందించే క్రిష్ ఇప్పుడు ఓ భారీ.. హిస్టారికల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రయత్నం విజయవంతమైతే... క్రిష్ బాటలోకి అగ్ర దర్శకులు కూడా వచ్చే అవకాశం ఉంది.
చారిత్రక నేపథ్యమున్న కథ కావటంతో ఎక్కడా లోపం లేకుండా క్రిష్ ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ అందిస్తున్న 100వ చిత్రం కావడంతో.. క్రిష్ ప్రతి అంశంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తల్లిని ఆదర్శంగా తీసుకుని రాజ్యమేలిన శాతకర్ణి చరిత్రలో చాలా అరుదైన రాజు. అందుకే ఆ తల్లి పాత్ర కోసం ఏరి కోరి బాలీవుడ్ అలనాటి డ్రీమ్ గర్ల్ హేమామాలినిని సెలెక్ట్ చేసుకున్నాడు. అంతే కాదు... ప్రతీ ఫ్రేములో భారీతనం ఉట్టిపడేలా తెరకెక్కిస్తున్నాడు క్రిష్.
ఇప్పటికే తక్కువ బడ్జెట్ మూవీ అయినా సూపర్ హిట్ అయిన హిస్టారిక్ మూవీ కంచె ఇచ్చిన ఇనిస్పిరేషన్తో క్రిష్ మరో భారీ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే.. క్రిష్ బాటలో మరింత మంది దర్శకులు నడిచే అవకాశం ఉంది.
