'ఉప్పెన' అదృష్టం..క్రిష్ కు అంటుకుంది
‘ఉప్పెన’ సినిమా మంచి విజయం సాధించడంతో క్రిష్ సినిమాపైనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుందని గతంలో వార్తలు హల్ చల్ చేసాయి.
వసూళ్లలో ఉప్పెన చూపిస్తున్న జోరు నిర్మాతలను ఆనందంలో ముంచెత్తుతోంది. అలాగే డైరక్టర్ కు కూడా ఈ సక్సెస్ ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏకంగా యాభై కోట్లు షేర్ తెచ్చుకుందంటే మాటలు కాదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హీరో,హీరోయిన్స్ కు పెరిగిన డిమాండ్ అయితే చెప్పక్కర్లేదు. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ హీరో నెక్ట్స్ ఫిల్మ్ పై ఉంటుందనటంలో సందేహం లేదు. ఆ నెక్ట్స్ ఫిల్మ్ మరెవరిదో కాదు డైరక్టర్ క్రిష్ ది. ఆయన సైలెంట్ గా ఈ హీరోతో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి క్రిష్-వైష్ణవ్ ల సినిమాను ఓటిటికి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఉప్పెన స్పీడ్ చూసిన యూనిట్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యిపోయినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు కూడా థియేట్రికల్ రిలీజ్ చేయమని ఒత్తిడి చేస్తున్నారని సమచారం. ఖచ్చితంగా ఓపినింగ్స్ బాగుంటాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా బ్లాక్ బస్టరే. దానికి తోడు ఈ సినిమా కూడా ఉప్పెన తరహాలోనే పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపి 45 రోజుల్లో పూర్తి చేశారు. పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేసే క్రిష్ ఈ చిత్రాన్ని ఎలాంటి హడావిడి లేకుండా వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో షూటింగ్ జరిపారు.
గ్రామీణ నేపథ్యంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ డీ గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ''కొండ పొలం'' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ని పెడుతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఒక ప్రముఖ నవల ఆధారంగా రూపొందితోందని సమాచారం. ఈ సినిమాలో రకుల్, రాయలసీమ అమ్మాయిగా కనిపించబోతోంది. ఆమె పేరు ఓబులమ్మ.