సంక్రాంతికు ఓ నాలుగు రోజులు ముందే బరిలో దిగిన చిత్రం మాస్ మహరాజా రవితేజ క్రాక్ . ఈ మూవీ మిగతా సంక్రాంతి సినిమాలు కన్నా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో లో నిలిచింది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా డైరక్టర్ మలినేని గోపీచంద్ దీనిని తెరకెక్కించిన విధానం జనాలకు బాగా ఎక్కింది. కరోనా తో  యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా 'క్రాక్' చక్కని కలెక్షన్లను రాబట్టింది. ఓటీటి రిలీజ్ లోనూ దుమ్ము రేపింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆశ్చర్యకరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరో రవితేజ కాదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తావించారు.

క్రాక్ సినిమా కథను ముందుగా బాలకృష్ణతో తీయాలనుకున్నట్టు నిర్మాత కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే.. గోపీచంద్ మలినేని  తమిళంలో హిట్టైన ‘సేతుపతి’ సినిమాను కొంచెం మార్పులు చేర్పులు చేసి మాకు వినిపించారు. ఈ కథ విని ఇది మా సినిమా స్టోరీనే కదా అని గోపిచంద్‌తో అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత బాలయ్య బిజీగా ఉండటం.. గోపీచంద్ మలినేని ఈ సినిమా కథను రవితేజతో  తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు.

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మించారు.  

డైరక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ... ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకోసం ఎదురు చూశారు. సరైన సమయానికి సరైన సినిమాగా ‘క్రాక్‌’ వచ్చింది. ఈ చిత్రంతో ఇప్పటిదాకా ఉన్న గందరగోళాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయి... పరిశ్రమకి మళ్లీ ఊపొచ్చింది’’ అన్నారు గోపీచంద్‌ మలినేని.