క్రాక్ బిజినెస్ ని,కలెక్షన్స్ ని మొత్తం మొదటి నుంచీ  గమనించారు అల్లు అరవింద్. తన ఓటీటి ఆహా కోసం ఈ సినిమాని వెంటనే తీసేసుకుని రిలీజ్ డేట్ ప్రకటించేసారు. జనవరి 29 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపద్యంలో ఈ సినిమా రైట్స్ కోసం ఆహా వారు ..నిర్మాతలకు ఎంత ఇచ్చారు అనేది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు క్రాక్ సినిమాని 8.25 కోట్లు ఖర్చు పెట్టి ఆహా వారు రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అమేజాన్ ప్రైమ్ వారు సైతం ఈ సినిమా రైట్స్ కోసం భారీగా ఖర్చుపెట్టడానికి రెడీ అయ్యారు. అయితే ఆహా కు చెందిన అల్లు అరవింద్ దూకుడుగా ముందుకువెళ్లి దాదాపు వేలంలో సొంతం చేసుకున్నట్లుగా ఈ రేటుకు ఫైనల్ చేసుకున్నారు. ఆహాలో రిలీజు అవుతున్న మొదటి పెద్ద సినిమా ఇదే కావటం విశేషం.

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న థియేట‌ర్‌ల‌లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. 

డైరక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ... ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకోసం ఎదురు చూశారు. సరైన సమయానికి సరైన సినిమాగా ‘క్రాక్‌’ వచ్చింది. ఈ చిత్రంతో ఇప్పటిదాకా ఉన్న గందరగోళాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయి... పరిశ్రమకి మళ్లీ ఊపొచ్చింది’’ అన్నారు గోపీచంద్‌ మలినేని.