సీనియర్ నటిగా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడి కమెడియన్ కోవై సరళ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత కొంత కాలంగా ఆమె పొలిటికల్ కెరీర్ పై అనేక రకాల రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నేడు అధికారికంగా కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) పార్టీలో  కోవై సరళ చేరారు. 

మహిళా దినోత్సవ సందర్బంగా కమల్ హాసన్ చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీటింగ్ లో పలువురు మహిళలు పాల్గొన్నారు. అదే విధంగా మక్కల్ నీది మయ్యమ్ లో చేరడానికి కోవై సరళ ప్రత్యేక అతిధిగా విచ్చేశారు.  మక్కల్ నీది మయ్యమ్ పార్టీ మగళిర్‌(మహిళలు) నీది మయ్యమ్ గా మారడానికి సిద్ధమైందని ఆ విధంగా మహిళలు ముందుకు వస్తున్నట్లు మాట్లాడారు. 

kovai sarala

కమల్ హాసన్ కూడా కోవై సరళను ప్రశంసిస్తూ మహిళలతో అభివృద్ధి ఎక్కువగా సాధ్యమవుతుందని వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన ఎంతో మహిళలు తమ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని కమల్ మాట్లాడారు. ఇక 700కు పైగా సినిమాల్లో నటించిన కోవై సరళ తెలుగు ప్రేక్షకులకు కూడా పలు హాస్య సినిమాలతో బాగా దగ్గరయ్యారు.