మహేష్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా టైమ్ వేస్ట్ వ్యవహారం లేదు. ఒకటి పూర్తవకుండానే మరొకటి పట్టాలు ఎక్కించేస్తున్నాడు. ప్రస్తుతంమహేశ్ బాబు 26వ సినిమా .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే మహేష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అయితే మహేశ్ బాబు తన 27వ సినిమాకు ఓ విశేషం ఉంది.

ఈ చిత్రానికి కొరటాల శివ సహ నిర్మాతగా వ్యవహిస్తారు.  మైత్రీ మూవీస్ బ్యానర్ తో కలిసి కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. మహేష్ కు కొరటాల శివకు ఉన్న అనుబంధంతో ఓకే చెప్పినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాకి దర్శకుడు పరశురామ్.  ప్రస్తుతం పరశురామ్ ఈ సినిమా ఫైనల్ వెర్షన్  పైనే కసరత్తు చేస్తున్నాడని తలుస్తోంది.  మొదట ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి.

 అల్లు అరవింద్ సైతం నమ్రతను కలిసి మాట్లాడారు. కానీ వర్కవుట్ కాలేదు. దాంతో పరుశరామ్ కథని నిర్మించటానికి మైత్రీమూవీస్ వారు ఉత్సాహం చూపిస్తున్నారు. కొరటాల శివకు మాట ఇచ్చి ఉండటంతో ఆయన సైతం సహ నిర్మాతగా వ్యవహిస్తారు.తమన్ ని సంగీత దర్శకుడు గా ఎంచుకున్నారు. వచ్చే జనవరి మూడవ వారం నుంచి షూటింగ్ ఉండనుంది. ఆగస్టు 7, 2020న రిలీజ్ చేయాలని డేట్ సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇంకో విశేషమేమిటంటే, పరశురామ్ ప్రాజెక్టు తరువాత కొరటాల శివతోనే కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. అంటే ముందు నిర్మాతగా .. ఆ తరువాత దర్శకుడిగా మహేశ్ బాబు కాంబినేషన్లో కొరటాల శివ సినిమాలు రానున్నాయన్న మాట. సరిలేరు నీకెవ్వరు చిత్రం నవంబర్ కు పూర్తైపోతుంది.