దర్శకుడిగా వరుస హిట్లు అందుకున్న కొరటాల శివ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడని సమాచారం. దర్శకుడిగా ఆయన తీసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవడంతో ఆయనకి టాలీవుడ్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ.

కథ కూడా పూర్తయింది. త్వరలోనే చిరుని డైరెక్ట్ చేయబోతున్నాడు. మరోపక్క నిర్మాతగా కూడా తన లక్ ని పరీక్షించుకోవాలని భావిస్తున్నాడు. ఓ అగ్ర నిర్మాణ సంస్థతో చేతులు కలిపి ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు కొరటాల. ఇందులో కొరటాల స్నేహితులు కొందరు పెట్టుబడులు పెట్టబోతున్నారని సమాచారం.

ఈ ప్రాజెక్ట్ లో కొరటాల కేవలం నిర్మాత పాత్రకే పరిమితం కాబోతున్నాడట. ఓ అగ్ర హీరోతోనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. నిర్మాతగా గనుక కొరటాల హిట్టు కొడితే.. తాను డైరెక్ట్ చేసే సినిమాల్లో కూడా నిర్మాతగా వాటా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో దర్శకులు నిర్మాతలుగా మారడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎవరూ భారీ ప్రాజెక్ట్ ల జోలికి పోలేదు. ఇప్పుడు కొరటాల భారీ బడ్జెట్ సినిమాతోనే నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రాబోతుంది.