అపజయం ఎరుగని స్టార్ డైరక్టర్ కొరటాల శివ మొదటిసారి తన సెంటిమెంట్ డైరెక్టర్ ని పక్కనపెడుతున్నాడు. సాధారణంగా తన కెరీర్ మొదటి నుంచి అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. మిర్చి - శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ - భరత్ అనే నేను సినిమాలకు దేవి మంచి మ్యూజిక్ అందించి కొరటాల సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేశాడు. 

టాలీవుడ్ లో కొరటాల కూడా మ్యూజిక్ డైరెక్టర్ ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ నెక్స్ట్ సినిమాకు కొరటాల రాక్ స్టార్ ని దూరం పెట్టేందుకు సిద్దమైనట్లు టాక్. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఒక సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 

ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఎండింగ్ లో మొదలుకానుంది. అయితే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కోసం చిత్ర యూనిట్ ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం. నిర్మాత రామ్ చరణ్ కూడా అమిత్ త్రివేది వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సైరా రిలీజ్ అనంతరం ఈ విషయంపై ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.