Asianet News TeluguAsianet News Telugu

పాత కథ పక్కకి.. ఎన్టీఆర్ కోసం ఓడలు, సముద్రాలు అంటున్న కొరటాల.. నిజమేనా ?

ఎన్టీఆర్ కోసం కొరటాల శివ రాస్తున్న ఈ న్యూ స్టోరీ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ ఓడలు, సముద్రాలపై జరిగే స్మగ్లింగ్ ఈ తరహాలో ఎన్టీఆర్, కొరటాల చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Koratala Siva new script for NTR
Author
First Published Aug 26, 2022, 9:15 AM IST

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడిన యంగ్ టైగర్.. ఆ చిత్రం పూర్తి కావడంతో విశ్రాంతి కోసం చిన్నవిరామం తీసుకున్నారు. అయితే వీలైనంత త్వరగానే ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రం ప్రారంభం అవుతుందని అభిమానులు భావించారు. 

కానీ స్క్రిప్ట్ ఓ కొలిక్కి రావడం లేదు. ముందుగా ఎంపిక చేసుకున్న కథలో లోపాలు ఉండడంతో కొరటాల వాటిని సరిచేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ కథ ఆశించినట్లుగా రావడం లేదట. దీనితో ఆలస్యం జరుగుతోంది. సమయం ఎక్కువగా గడచిపోతుండడంతో కొరటాల ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కొత్త కథ రాసుకునే పనిలో ఉన్నారట. నవంబర్ కల్లా కథ పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం కొరటాల శివ రాస్తున్న ఈ న్యూ స్టోరీ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ ఓడలు, సముద్రాలపై జరిగే స్మగ్లింగ్ ఈ తరహాలో ఎన్టీఆర్, కొరటాల చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కేలా కథని రెడీ చేసుకుంటున్నారట. గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ చిత్రం వచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. కొరటాల చిత్రం తర్వాత ఎన్టీఆర్.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios