Asianet News TeluguAsianet News Telugu

అనిరుధ్ మాస్ బీట్స్ కి ఎన్టీఆర్ స్టెప్ వేస్తే... కొరటాల ఎంపిక అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!


ఎన్టీఆర్ 30 కోసం దర్శకుడు కొరటాల శివ బెస్ట్ టీమ్ ని ఎంపిక చేస్తున్నారు. ప్రధాన క్రాఫ్ట్స్ లో ఒకటైన మ్యూజిక్ కోసం యంగ్ సెన్సేషన్ అనిరుధ్ ని తీసుకున్నారు. అతనితో కొరటాల మ్యూజిక్ చర్చలు జరుపుతున్నారు. 
 

 koratala siva music sittings with anirudh ravichandran for ntr 30
Author
First Published Nov 20, 2022, 1:16 PM IST

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఎన్టీఆర్ 30 చిత్రానికి సంగీతం అందించనున్నారు. దర్శకుడు కొరటాల శివ ఫస్ట్ టైం తన చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని ఎంచుకున్నాడు. కెరీర్ బిగినింగ్ నుండి కొరటాల చిత్రాలకు దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆచార్య చిత్రానికి మాత్రం మణిశర్మను తీసుకున్నారు. ఎన్టీఆర్ 30 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అనిరుధ్ కి ఈ బాధ్యతలు అప్పగించారు. 

అనిరుధ్ తో సంగీత చర్చలు జరుపుతున్న కొరటాల శివ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక అనిరుధ్ ఎంపిక పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనిరుధ్ మాస్ బీట్స్ కి ఎన్టీఆర్ తన స్టెప్స్ తో దుమ్మురేపడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. కాగా అనిరుధ్ తెలుగు చిత్రాలకు సంగీతం ఇచ్చింది తక్కువ. అజ్ఞాతవాసి మూవీతో అతడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. యూ టర్న్, జెర్సీ చిత్రాల్లో ఒక పాట చొప్పున కంపోజ్ చేశారు. 

నాని గ్యాంగ్ లీడర్ మూవీకి అనిరుధ్ పూర్తి స్థాయిలో సంగీత దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలో అనిరుధ్ ఎన్టీఆర్ కి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడనే ఆసక్తి నెలకొంది. కాగా త్వరలో ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా హైడ్రామా నడిచింది. ఒక దశలో ఆగిపోయినట్లు పుకార్లు వినిపించాయి. కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ లో పాల్గొంటున్న ఫోటోలు బయటకు రావడంతో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. 

ఇక ఈ చిత్ర హీరోయిన్ ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు. ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నా అధికారిక సమాచారం లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ మూవీ విడుదలయ్యే సూచనలు కలవు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios