సైరా పనులు అయిపోగానే కొరటాల శివతో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలనీ మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ వేసుకుంటున్నాడు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చెయ్యాలని ప్రాజెక్ట్ నిర్మాత రామ్ చరణ్ ను మెగాస్టార్ ఆదేశించినట్లు తెలుస్తోంది. 

అయితే హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ గత కొంత కాలంగా సతమతమవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల కొత్త హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు చిరంజీవి మళ్ళీ నయనతారతోనే స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వస్తోంది. సైరా సినిమా ద్వారా మొదటిసారి మెగాస్టార్ తో నటించిన నయన్ కు చిత్ర యూనిట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

స్క్రీన్ పై మెగాస్టార్ కి కరెక్ట్ సరిపోవడంతో రిస్క్ లేకుండా తదుపరి ప్రాజెక్ట్ కి కూడా ఆమెనే సెలెక్ట్ చేయాలనీ నిర్మాత దర్శకుడితో చర్చినట్లు సమాచారం. సైరా షూటింగ్ రీసెంట్ గా పూర్తయ్యింది. అలాగే డబ్బింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. కుదిరితే మెగాస్టార్ - కొరటాల ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉపందుకోనుంది.