దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల చిరంజీవి కోసం అనుకున్న లైన్ ని కథగా సిద్ధం చేసి అతడికి వినిపించారట. కానీ చిరంజీవికి మాత్రం కథ సంతృప్తిగా అనిపించలేదని తెలుస్తోంది.

కొరటాల కథను వినిపించిన తరువాత ప్లాట్, హీరో క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ ఉన్నాయని చిరు ఫీల్ అయ్యాడట. అదే విషయాన్ని కొరటాలకి కూడా చెప్పినట్లు సమాచారం. మన కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని, రెగ్యులర్ మసాలా కథలు వద్దని చిరు.. కొరటాలతో చెప్పినట్లు తెలుస్తోంది.

కుదిరితే కథను కొత్తగా రాసుకోమని, లేదంటే మరో కొత్త కథను సిద్ధం చేయమని కొరటాలకి సూచించారట. చిరు డెసిషన్ తో కొరటాల అసహనానికి లోనైనప్పటికీ ఆయనపై ఉన్న గౌరవంతో కథపై మరోసారి వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాడట. రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన కొరటాల, దర్శకుడిగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు.

అలాంటిది తన కథ నచ్చలేదని చిరు చెప్పడంతో మరింత పంతంతో కథను సిద్ధం చేస్తున్నాడట. మరో రెండు నెలల పాటు స్క్రిప్ట్ మీద పని చేసి వేసవిలో సినిమాను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా హీరోయిన్ ని కూడా ఫైనల్ చేయాలని చూస్తున్నారు. అనుష్క లేదా నయనతారలలో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.