మెగాస్టార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమాను ఎలాగైనా అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలనీ నిర్మాత రామ్ చరణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలనీ మెగాస్టార్ ఆలోచిస్తున్నారు. 

అయితే ఈ లోపు కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నారు. అందుకోసం మెగాస్టార్ వర్క్ షాప్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ మెగాస్టార్ ని రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించనున్నాడు. అందులో ఒక పాత్ర కోసం లుక్ ని తప్పనిసరిగా టెస్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కొరటాల చెప్పినట్లు ఫిట్ నెస్ లో ఫెస్ లుక్ లో కాస్త మార్పులు తెచ్చిన చిరు ఫైనల్ టెస్ట్ కు వెళ్లనున్నారు. 

ఈ టెస్ట్ లో మెగాస్టార్ ని పరీక్షించి ఫైనల్ గ ఒక లుక్ ని ఫిక్స్ చేసి మొదటి షెడ్యూల్ ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ వీక్ లో ఈ వర్క్ పూర్తవుతుంది. యూనివర్సల్ సోషల్ మెస్సేజ్ తో పాటు మాస్ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా కొరటాల కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటులను సెలెక్ట్ చేసేపనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు.