మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్ పై 'ఖైదీ నెంబర్ 150' సినిమాను నిర్మించి భారీ లాభాలను ఆర్జించారు. ప్రస్తుతం చిరంజీవితో 'సై రా నరసింహారెడ్డి' సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు తన తండ్రితో సినిమాలు చేసిన రామ్ చరణ్ ఇప్పుడు బయట హీరోలతో సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో నందమూరి హీరో ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి మరొకరూ వెళ్తూ.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేస్తూ తమ మధ్య బాండింగ్ గురించి చెప్పకనే చెబుతున్నారు.

ఇప్పుడు రామ్ చరణ్ తనతో సినిమా చేయాలనుకుంటే ఎన్టీఆర్ కూడా కాదనకపోవచ్చు. ఈ విషయంపై చూచాయగా ఎన్టీఆర్ వద్ద రామ్ చరణ్ ప్రస్తావించినట్లు సమాచారం. ఎన్టీఆర్ కూడా దీనికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కొణిదల ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు మాత్రం బయటకి రాలేదు. ఈ ప్రాజెక్ట్ గనుక సెట్స్ పైకి వెళ్తే.. మెగా-నందమూరి అభిమానుల మధ్య సందడి మాములుగా ఉండదు. ఇది ఇలా ఉండగా త్వరలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.