మెగాడాటర్ నీహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా తన టాలెంట్ నిరూపించుకునే పనిలో పడింది. ఆమె నటించిన చిత్రాల్లో పద్దతిగానే కనిపించింది. బయట కూడా పెద్దగా గ్లామర్ షో చేయని ఈ బ్యూటీ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో ఓ ఫోటో తీయించుకుంది నీహారిక.

ఆమె తల్లి స్వయంగా ఆ ఫోటో తీసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'బీచ్ లో సరదాగా గడిపిన రోజు కంటే బెస్ట్ మరొకటి లేదు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో నీహారిక లాంగ్ షర్ట్ ధరించింది. ప్యాంట్ వేసుకోకుండా ఒక షార్ట్ మాత్రం వేసుకుంది.

ఈ ఫోటోలో ఆమె హాట్ గా కనిపించడంతో కొందరు ఆమెని టార్గెట్ చేశారు. 'మీరు మెగా ఫ్యామిలీలో పుట్టారు.. కొంచెం గౌరవడంగా ఉండడం నేర్చుకోండి' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఏకంగా 'ప్యాంట్ మర్చిపోయావా.. నీహారిక' అంటూ ప్రశ్నిస్తున్నారు.

'దయచేసి స్కిన్ షో.. చేయొద్దని' రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన 'హ్యాపీ వెడ్డింగ్' సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Nothing like a good beach day! 😍 . 📸 Amma😘

A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 30, 2019 at 3:06am PDT