Asianet News TeluguAsianet News Telugu

‘కొండ‌పొలం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంత దారుణం అంటే...

క్రిష్ దర్శకత్వంలో ఇటీవల 'కొండ పొలం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్ తేజ్ - రకుల్ జంటగా రూపొందిన ఈ సినిమా, కథాకథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కీరవాణి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. 

Kondapolam posts low numbers in the first weekend
Author
Hyderabad, First Published Oct 12, 2021, 10:28 AM IST


చాలా రోజుల త‌ర్వాత తెలుగు తెర‌పైకొచ్చిన న‌వ‌లా చిత్రం ‘కొండ‌పొలం(Konda Polam)’. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన న‌వ‌ల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. విజ‌య‌వంత‌మైన ‘ఉప్పెన‌’ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్(vaishnav tej) న‌టించిన చిత్రం కావ‌డం... క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌డంతో సినిమాపై  ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. అయితే అనుకున్న స్దాయిలో టాక్ రాలేదు. మిక్సడ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో చిత్రం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమాకు ఓపినింగ్స్ లేకపోవటం, కలెక్షన్స్ బాగా తక్కువగా ఉండటం నిర్మాతను షాక్ కు గురి చేసాయి. అందుకు కారణం ఇదో అవార్డ్ సినిమా అనిపించటం, ఆర్ట్ ఫిల్మ్ లుక్ రావటమే అంటున్నారు. దానికి తోడు పాటలు కూడా పెద్దగా ఎక్కలేదు. ఉప్పెనకు ప్లస్ అయిన సాంగ్స్ ఇక్కడలేవు. సాంగ్స్ వర్కవుట్ అయినా భారీగా ఓపినింగ్స్ వచ్చేవి. అదీ జరగలేదు. అవన్ని ప్రక్కన పెడితే స్లో నేరేషన్ కావటం, మౌత్ టాక్ సరిగ్గా లేకపోవటం సినిమాకు మైనస్ గా మారాయి.

Also read టాప్ సీక్రెట్ లీక్ చేసిన హీరోయిన్ శ్రీయా శరణ్ ... ఆ సమయంలో రహస్యంగా ఆడపిల్లకు జన్మనిచ్చానంటూ...

కలెక్షన్స్ చూస్తే.. ఉప్పెన సినిమాకు మొదటరోజు వచ్చిన కలెక్షన్స్  ని కొండపొలం మూడు రోజుల్లో కూడా రాలేదు. ఉప్పెన మొదటిరోజే 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది. కానీ కొండపొలం మూడు రోజుల్లో 3 కోట్లు కూడా తీసుకురాకపోవటమే ఆశ్చర్యం అనిపించింది.

ఏరియా వారిగా ఫస్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్లు..

నైజాం: 0.72 కోట్లు
సీడెడ్: 0.29 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.52 కోట్లు
ఈస్ట్: 0.27 కోట్లు
వెస్ట్: 0.21 కోట్లు
గుంటూరు: 0.32 కోట్లు
కృష్ణా: 0.22 కోట్లు
నెల్లూరు: 0.16 కోట్లు

ఏపీ + తెలంగాణ: 2.71 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.24 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 2.95 కోట్లు షేర్

ఇక ‘కొండపొలం’ చిత్రానికి రూ.7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే మొత్తం రూ.8 కోట్లు అయినా రావాలి. కానీ ప్రస్తుతం సినిమా రన్ చూస్తూంటే కష్టమే అనిపిస్తోంది. ఈ చిత్రం న‌ల్ల‌మ‌ల నేప‌థ్యంలో సాగుతుంది. ఓ యువ‌కుడి ఎడ్వెంచర్.  భ‌యం భ‌యంగా క‌నిపించే ఓ కుర్రాడు... ఆత్మ‌విశ్వాసంతో త‌ల‌పైకెత్తి నిలిచేంత ధైర్యాన్ని, త‌న‌పై త‌న‌కి న‌మ్మ‌కాన్ని అడ‌వి, అడ‌విలాంటి ఓ అమ్మాయి ఎలా ఇచ్చార‌నేది ఈ సినిమాలో ఇంట్రస్టింగ్ అంశం. గొర్రెల కాపరుల జీవిత చిత్రాన్ని తెర‌పై స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ మొద‌ల‌య్యే ఈ క‌థ‌... అడ‌విలోకి వెళుతున్న‌ కొద్దీ ప్ర‌యాణం సాగుతున్న‌ కొద్దీ కొత్త టర్న్ తీసుకుంటుంది. హీరోకి ఎదుర‌య్యే ఒక్కొక్క స‌వాల్‌... ఒక్కో వ్య‌క్తిత్వ వికాస పాఠంలా ఉంటుంది. అడ‌వి ఎంత గొప్ప‌దో, దాన్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్యత మ‌న‌పై ఎంత ఉందో ఆ సీన్స్  చాటి చెబుతాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios