తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్ తో పాటు సౌత్ మొత్తం మీద ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు స్టార్ హీరో. ఇక బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకోబోతున్నాడు.
ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు సూర్య. నటనకు నిలువెత్తు రూపం, రీసెంట్ గా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరో క్రేజ్ దేశమంతా మారుమోగిపోతోంది. వరుసగా సక్సెస్ లు అందుకుంటూ.. గెలుపోటములతో సంబంధం లేకుండా వరుసగా ఎక్స్ పెర్మెంట్స్ చేస్తూ.. సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు సూర్య. జై భీమ్, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అగ్ర నటుడు సూర్య. ప్రస్తుతం ఆయన వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మిడ్ లో ఆయన హిందీ సినిమా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖుదాఫీస్ ఫేమ్ దర్శకుడు ఫరూఖ్ కబీర్ ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాలి అని అనుకుుంటున్నాడు. దాని కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా సూర్యను తీసుకోవాలి అనుకున్నారట డైరెక్టర్. సూర్య కోసమే ఈ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కథను రీసెంట్ గా సూర్యకు వినిపించాడట దర్శకుడు . ఈ కథ వినగానే సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు ఫరూఖ్ కబీర్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం సూర్య ప్రయోగాల దర్శకుడు.. బాలా దర్శకత్వంలో వణంగాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తనకు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో ఓసినిమాకు సైన్ చేశారు.
అంతే ఇప్పటికే వరుస సినిమాలు ప్లాన్ చేసుకున్న సూర్య.. ఒక ప్లాన్ ప్రకారం వాటిని కంప్లీట్ చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌తో కూడా ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పారు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా సూర్య తన టైమ్ ను కేటాయించి కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో నటించి మెప్పిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన విక్రమ్, రాకెట్రీ సినిమాల్లో సూర్య అతిథి పాత్రల్లో ఆకట్టుకున్నారు.
