టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న కోలీవుడ్ హీరో సూర్య. గజినీ నుంచి సూర్య హీరోగా నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా భారీగా రిలీజ్ అవుతోంది.  టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మార్కెట్ ఏర్పడడంతో డైరెక్ట్ గా ఒక తెలుగు సినిమా చేసి తెలుగు జనాలకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. 

గతంలో చాలా సార్లు సూర్యకి టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. కొన్నిసార్లు త్రివిక్రమ్ తో కూడా వర్క్ చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. ఇక బాహుబలిలో నటించే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు. అయితే నెక్స్ట్ ఎలాగైనా ఒక తెలుగు కథతో టాలీవుడ్ జనాలను ఆకట్టుకోవాలని సూర్య తెలుగు రచయితలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ రైటర్స్ బివిఎస్ రవి - గోపి మోహన్ ఇటీవల సూర్య కి ఒక కథను వినిపించినట్లు సమాచారం. 

ఆ కథపై పాజిటివ్ గా రియాక్ట్ అయిన సూర్య త్వరలో మరోసారి కలుస్తాను అని చెప్పాడట. సుధా కొంగరా డైరెక్షన్ లో ఇటీవల ఒక సినిమాను పూర్తి చేసిన సూర్య నెక్స్ట్ హరి డైరెక్షన్ లో మరో యాక్షన్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఆ సినిమా అనంతరం శివ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో తెలుగు సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.