సైంధవ్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ సోలోగా భారీ కమర్షియల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.
వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో స్టార్ క్యాస్ట్ అంతకంతకు పెరిగిపోతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ఆర్య వచ్చి చేరాడు. హిట్ సిరీస్ తో దర్శకుడిగా వెలుగులోకి వచ్చాడు శైలేష్ కొలను. మూడో చిత్రంగా హీరో వెంకటేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకీ 75వ చిత్రం సైంధవ్. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కుతుంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.
సైంధవ్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ సోలోగా భారీ కమర్షియల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఆండ్రియా జెర్మియా, రుహాని శర్మ కీలక రోల్స్ చేస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తుండగా ఆయనది నెగిటివ్ రోల్ అని సమాచారం.
నేడు కోలీవుడ్ హీరో ఆర్య నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. సైంధవ్ నుండి ఆయన లుక్ విడుదల చేశారు. చేతిలో గన్ తో ఆర్య ఫెరోషియస్ లుక్ అదిరింది. ఆయన పాత్ర పేరు మానస్ అని పోస్టర్ లో వేశారు. సైంధవ్ పై ఈ అప్డేట్ అంచనాలు పెంచేసింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా... సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
కాగా ఈ మధ్య వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్స్ చేస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ తో చేసిన ఎఫ్ 3 యావరేజ్ రిజల్ట్ అందుకుంది. మరి సైంధవ్ తో సోలో బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.
