కొద్దిరోజులు క్రితం నితీష్ వీర అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో ఆయనకు కరోనగా నిర్ధారణ అయ్యింది.

చిత్ర పరిశ్రమలో కరోనా మరణాలు సర్వసాధారణంగా మారడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ అనేక మంది నటుల ప్రాణాలు బలిగొంది. తాజాగా పలు సూపర్ హిట్ చిత్రాలలో కీలక రోల్స్ చేసిన నటుడు నితీష్ వీర కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కొద్దిరోజులు క్రితం నితీష్ వీర అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో ఆయనకు కరోనగా నిర్ధారణ అయ్యింది. దీనితో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింత విషమంగా మారింది. డాక్టర్స్ ఎంతగా ప్రయత్నం చేసినా కాపాడలేకపోయారు.

రాజనీకాంత్ నటించిన కాలా మూవీలో నితీష్ వీర కీలక రోల్ చేశారు. అలాగే ధనుష్ బ్లాక్ బస్టర్ హిట్ అసురన్ చిత్రంలో కూడా నితీష్ ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయడం జరిగింది. ఎంతో భవిష్యత్ ఉన్న నితీష్ అకాలమరణానికి కోలీవుడ్ చిత్ర ప్రముఖులు షాక్ కి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మదురైకి చెందిన నితీష్ కి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.