Asianet News TeluguAsianet News Telugu

‘రిపబ్లిక్’ చిత్రం పై వివాదం, ఆ సీన్స్ తీసేయమంటూ కొల్లేరు ప్రజల డిమాండ్


 
 ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..వంటి డైలాగులతో .. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రిపబ్లిక్’. రిపబ్లిక్‌ చిత్రంలో కొల్లేరు ప్రజల జీవనశైలిని దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని కొల్లేరు గ్రామాల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. 

Kolleru Villagers Complaint Against Republic
Author
Hyderabad, First Published Oct 6, 2021, 12:35 PM IST

 ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..వంటి డైలాగులతో .. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రిపబ్లిక్’. రిపబ్లిక్‌ చిత్రంలో కొల్లేరు ప్రజల జీవనశైలిని దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని కొల్లేరు గ్రామాల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద   ధర్నా నిర్వహించారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

 సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉండటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వచ్చి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ రిపబ్లిక్ మూవీకి హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా టాక్ యావరేజ్ అనిపించుకోవటంతో పాటు, సినిమా రన్ కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో వైసీపీ నాయకులు రిలీజ్ రోజున కొన్ని చోట్ల ఈ సినిమాని అడ్డుకున్నారు. థియేటర్ల బయట ధర్నాలు చేశారు. తాజాగా ఈ సినిమాకి మరో సమస్య ఎదురయ్యింది.

  ‘రిపబ్లిక్‌’ సినిమాపై పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచేలా సినిమాను చిత్రీకరించిన దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 

వడ్డి కుల సంక్షేమ సంఘం నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరు ప్రజలు విషపూరిత రసాయనాలతో చేపల సాగు చేస్తున్నట్లుగా ‘రిపబ్లిక్’ సినిమాలో చూపించడం దారుణమన్నారు. దీనివల్ల చేపల సాగుపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. 

రాష్ట్ర వడ్డి కుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సైదు గాయత్రి సంతోషి మాట్లాడుతూ.. ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఇలా అసత్యాలతో సినిమా తీయడం దారుణమని అన్నారు. చిత్ర ప్రదర్శన నిలిపివేయకపోతే
ఆందోళన చేస్తామని ఏపీ ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పల్లెం ప్రసాద్‌ హెచ్చరించారు. కైకలూరు, కొల్లేటి కోటలో కూడా ఆందోళన చేపట్టారు. రిపబ్లిక్‌ సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ థియేటర్‌ వద్ద, హైవేపై నిరసన తెలిపారు.

ఇక సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ కు ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తేజ్.. ఎమోషనల్ సీన్స్‌లో హావభావాలతో ఆకట్టుకున్నాడని అందరు అంటున్నారు. ఐశ్వర్య రాజేష్ నటనకు ఆస్కారమున్న రోల్‌లో ది బెస్ట్ ఇచ్చింది. ఇక రమ్యకృష్ణ చాలా కాలం తర్వాత నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో అదరగొట్టేసింది. సినిమాకు వెన్నముకలాంటి విశాఖ వాణి పాత్రను ఆమె తప్ప మరెవరూ చెయ్యలేరనిపించేలా చేశారు. ఇక జగపతి బాబు క్యారెక్టర్ కూడా సినిమాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అనే చెప్పాలి.. మిగతా నటీనటులంతా తమ క్యారెక్టర్ల మేర చక్కగా నటించి మెప్పించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios