బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి కోహ్లీ ఎమోషనల్ మూమెంట్ లో భాగమైంది. ఫామ్ కోల్పోయినప్పుడు కెరీర్ అపజయాలతో సతమతమైనప్పుడు ఎల్లవేళలా తనకు తోడుగా అనుష్క ఉంటుందని చాలా సార్లు విరాట్ బహిర్గతం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భర్తకు అండగా ఉండే భార్య అని మరోసారి అనుష్క ఒక ముద్దుతో అభిమానులను ఆకట్టుకున్నారు. 

రీసెంట్ గా ఢిల్లీలోని ఫోరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. అలాగే ఒక స్టాండ్ కి విరాట్ పేరును పెట్టారు. అయితే ఈవెంట్ లో డీడీసీఏ అధ్యక్షుడు కోహ్లీ గురించి అర్జున్ జైట్లీ చెప్పిన కొన్ని మాటలను గుర్తు చేసుకున్నారు. విరాట్ తన తండ్రి మరణించిన సమయంలో కూడా దేశం కోసం ఆడడానికి వెళ్లినట్లు అర్జు  జైట్లీ చెబుతుండేవారని అంతే కాకుండా కోహ్లీ కంటే గొప్ప ఆటగాడు వరల్డ్ లోనే లేడని కూడా అంటుండేవారని  రజత్ శర్మ మాట్లాడారు. 

ఆ మాటలకు కోహ్లీ ఎమోషనల్ అవ్వగా అనుష్క తన భర్త చేతిని దగ్గరికి తీసుకొని  ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వీరుష్క జంట పర్ఫెక్ట్ కాంబో అని ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆదివారం విరాట్ సౌత్ ఆఫ్రికాతో జరగనునున్న టీ20 సిరీస్ తో బిజీ కానున్నాడు.