బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా రోజుల తరువాత వెండితెరపై తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. హృదయ కాలేయం తప్పితే ఇంతవరకు సంపూ సరైన సక్సెస్ అందుకోలేదు. అయితే అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. అలాగే పట్టుదల కూడా తగ్గలేదని ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ చేస్తుంటే అర్ధమవుతోంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సంపూర్ణేష్ బాబు నుంచి రాబోతున్న కొబ్బరి మట్ట సినిమా గత ఏడాది నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఫైనల్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మినిమమ్ 3కోట్లను సాధిస్తేనే హిట్టయినట్లు లెక్క. ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 2కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలు చిన్నవే అయినా సినిమా ఎంతో కొంత రాబడితేనే నిర్మాత సేఫ్ జోన్ లోకి వస్తాడు. 

సంపూ అలాగే దర్శకుడు కూడా ఫామ్ లోకి వస్తారు. హడావుడి చూస్తుంటే సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. కానీ కామెడీ యాంగిల్ లో సినిమా ఎలాంటి సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టం. ఇక పోటీగా ఒకరోజు ముందే ఆగస్ట్ 9న నాగార్జున మన్మథుడు 2 రిలీజ్ కాబోతోంది. మరి ఈ పోటీలో సంపూ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.