జనసేన వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు ఇంకా కొద్దీ రోజులే ఉండడంతో మెగా అభిమానుల్లో హంగామా మొదలైంది. ముఖ్య జనసేనుడి అభిమానులు స్పెషల్ గా ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో జోరుగా షేర్ చేస్తున్నారు. అయితే కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేష్ అభిమానుల కోలాహలానికి తనవంతు విరాళాన్ని ప్రకటించాడు. 

మరో 15 రోజుల్లో జనసేన నాయకుడి బర్త్ డే అని ట్వీట్ చేసిన సాయి రాజేష్ అభిమానులు తన ట్వీట్ ని రీ ట్విట్ చేస్తే విరాళాన్ని ఇస్తానని చెప్పాడు. ఒక్కో ట్వీట్ కి 10రూపాయల చొప్పున మొత్తంగా 24గంటల్లో వచ్చిన 6,682 రీ ట్విట్స్ కి గాను 66,680రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు  దర్శకుడు సాయి రాజేష్ పేర్కొన్నాడు. 

ఆలాగే తన స్నేహితుడు ఉమా మహేష్ కొండా ఈ డబ్బుకు 33,180రూపాయలను జతచేయగా మొత్తంగా లక్ష రూపాయలను కొబ్బరి మట్ట తరపున జనసేన పార్టీకి ఇవ్వనున్నట్లు తెలిపాడు. అలాగే పవన్ అభిమానులు చూపించిన ప్రేమకు చాలా కృతజ్ఞతలని కూడా దర్శకుడు తెలియజేశారు.