Asianet News TeluguAsianet News Telugu

నా పని అయిపోయిందని చెప్పడానికి మీరెవరు? కిరణ్‌ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు.. `క` టీజర్ ఎలా ఉందంటే..

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన `క` మూవీ టీజర్‌ విడుదలైంది. ఈ ఈవెంట్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు, పలు సంచలన కామెంట్స్ చేశారు. 
 

kiran abbavaram sensational comments on KA movie teaser event viral now arj
Author
First Published Jul 15, 2024, 5:27 PM IST | Last Updated Jul 15, 2024, 5:27 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం `రాజా వారు రాణిగారు` చిత్రంతో ఆకట్టుకున్నాడు. `ఎస్ఆర్ కళ్యాణమండపం`తో హిట్‌ కొట్టి, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయనకు మళ్లీ ఆ స్థాయి విజయాలు దక్కలేదు. బ్రేక్‌ ఇచ్చే మూవీ పడలేదు. వరుసగా సినిమాలు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇక కిరణ్‌ అబ్బవరం పని అయిపోయిందనే కామెంట్స్ వచ్చాయి. సోషల్‌ మీడియాలోనూ ట్రోలింగ్‌ జరిగింది. ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న కిరణ్‌ తాజాగా దీనిపై ఓపెన్‌ అయ్యాడు. 

ప్రస్తుతం ఆయన `క` అనే సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. నేడు కిరణ్‌ అబ్బవరం పుట్టిన రోజుని పురస్కరించుకుని `క` సినిమా టీజర్ ని సోమవారం విడుదల చేశారు. ఈసందర్బంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించడంతోపాటు సంచలన కామెంట్స్ చేశారు. తన పని అయిపోయిందనే కామెంట్లపై  ఆయన రియాక్ట్ అవుతూ, ఇలా చాలా మంది తన గురించి మాట్లాడుకున్నారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెట్టారు, కానీ మన పని అయిపోయిందని వేరే ఎవరో చెప్పలేరు, వేరే వాళ్లకి తెలియదు, అది మనకే తెలుస్తుంది మన పని అయిపోయిందా లేదా? అనేది. నా పని అయిపోయిందనేది నాకు మాత్రమే తెలుసు. నా మటుకు నా పని అయిపోయిందనుకోవట్లేదు. ఒకవేళ అలా అనిపించినప్పుడు ఇక సినిమాలు చేయను` అంటూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు కిరణ్‌ అబ్బవరం. `క` సినిమాతో తానేంటో తెలుస్తుందని, మళ్లీ పుంజుకుంటాననే నమ్మకం ఉందని చెప్పారు. 

తెలుగులోనే ఇంకా నిలబడలేదు, సరైన హిట్లు లేవు, `క`తో పాన్‌ ఇండియా రిలీజ్‌కి వెళ్తున్నారు? ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నకి స్పందిస్తూ, కంటెంట్‌ ఉంటే లాంగ్వేజ్‌తో పనిలేదని, హీరో, హీరో ఇమేజ్‌, మార్కెట్‌తో పనిలేదని చెప్పాడు కిరణ్‌. `కాంతార`, `మంజుమేల్‌ బాయ్స్`, `ప్రేమలు` చిత్రాలు తెలుగులో పెద్ద హిట్‌ అయ్యాయి. అంతకు ముందు ఆ హీరోలెవరో మనకు తెలియదు. `క` సినిమా విషయంలోనూ అదే నమ్ముతున్నాం. నేనేదో పెద్ద హీరోని అని, అక్కడ నన్ను చూసి ఆదరిస్తారని అనుకోవడంలేదు, కంటెంట్‌ బాగుందని, అదే మమ్మల్ని తీసుకెళ్తుందని భావించి పాన్‌ ఇండియా రిలీజ్‌కి వెళ్తున్నాం` అని చెప్పారు కిరణ్‌. 

ఈ సందర్భంగా తాను కొన్ని మిస్టేక్స్ ని ఒప్పుకున్నారు. గత చిత్రాల విషయాల్లో తాను కొంత మిస్టేక్‌ చేశాను, కథల ఎంపికలోనూ పొరపాట్లు జరిగాయి. వాటి నుంచి నేర్చుకున్నాను. ఆ తప్పులు చేయకూడదని ఇప్పుడు పక్కాగా `క` సినిమాని చేస్తున్నాను. ఈ మూవీ తీస్తున్నట్టుగా ఎవరికీ తెలియదు. సినిమా ఓపెనింగ్‌ చేయలేదు, అనౌన్స్ చేయలేదు, స్క్రిప్ట్ నచ్చి, బాగా వర్కౌట్‌ చేసి, సినిమా షూట్‌ చేసి, ఔట్‌ పుట్‌ బాగా వచ్చిందని తెలిసిన తర్వాత, ఔట్‌పుట్‌ చూసుకున్నాకనే దీన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం అని చెప్పారు కిరణ్‌. ఇకపై కూడా చాలా సెలక్టీవ్‌గా వెళ్తానని తెలిపారు కిరణ్‌. యాక్టింగ్‌ పరంగానూ తన తప్పులను సరి చేసుకుని ఈ మూవీ చేశానని, `క`తో తనని కొత్తగా చూస్తారని చెప్పారు కిరణ్. 

ఇక `క` టీజర్‌ చూస్తే.. టైమ్‌ మెషిన్‌తో టీజర్‌ సాగుతుంది. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్‌?..  పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి నీకు? నీకంటూ ఎవరూ లేరా?హత్యలు చేసేంత వరకు వెళ్లావ్‌. అసలు నువ్వేంట్రా? అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ పోస్టర్‌ని ముందు కూర్చొని `నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను .. అంటూ భయపెట్టాడు కిరణ్‌. కిరణ్‌ ఓ వైపు పోస్ట్ మేన్‌గా, మరోవైపు హంతకుడిగా కనిపిస్తున్నాడు. ఫారెస్ట్ లో ఇదంతా జరుగుతుంది. ఫైనల్‌గా `తోడేలువురా నువ్వు` అని చెప్పే డైలాగ్‌తో కిరణ్‌లో నెగటివ్‌ షేడ్‌ కనిపిస్తుంది. `కాంతార` తరహాలో ఏదో సస్పెన్స్ అంశాలతో టీజర్‌ సాగింది. ఉత్కంఠకి గురి చేస్తూ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. 

ఇందులో కిరణ్‌ లుక్‌ కొత్తగా ఉంది. పీరియాడికల్ మూవీ ఇది. 1970లో జరిగే కథ అని తెలుస్తుంది. బీజీఎం అదిరిపోయింది. కిరణ్‌ అబ్బవరం రేంజ్‌ని పెంచే మూవీ కాబోతుందని `క` టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. దీనికి సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించగా, సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు. త్వరలోనే ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios