యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ దృష్టి ని ఆకర్షిస్తున్నాడు. ఇక ఇప్పుడు తను నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు హీరో.  

యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ దృష్టి ని ఆకర్షిస్తున్నాడు. ఇక ఇప్పుడు తను నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు హీరో.

రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ఓపేరు తెచ్చుకున్నారు.రెండో సినిమా ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపంతో మరో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నారు. క్లాసు-మాసు, యూత్‌- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ హీరో మరో సినిమాతో మన ముందకు రాబోతున్నాడు.

 తాజాగా మార్చి 4న సెబాస్టియన్‌ పిసి 524 తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష జంటగా.. బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా సెబాస్టియన్‌ పిసి524. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. రాజావారు రాణిగారు, ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం సినిమాల సక్సెస్ తో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరపుకు మా సెబాస్టియన్‌ పిసి524 ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుంది. జిబ్రాన్‌ సంగీత సారధ్యంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా హెలి అనే పాటకు అస్సలు ఊహించ లేనటువంటి రెస్పాన్స్ ప్రేక్షకులనుండి లభించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉంది. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది అన్నారు.

కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇక రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథ. యూత్ లో కిరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.