Asianet News TeluguAsianet News Telugu

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎక్కడ కట్టాడో తెలుసా?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సొంతింటి కలను నిజం చేసుకున్నారు. తాజాగా గృహప్రవేశం కూడా పూర్తైంది. తనకిష్టమైన చోటే ఇళ్లు నిర్మించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఓ వీడియోనూ పంచుకున్నారు. 
 

Kiran Abbavaram New House Opening Ceremony NSK
Author
First Published Sep 28, 2023, 4:43 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమా తప్ప మరో లోకం లేదనేలా మారిపోయారు. ఎప్పుడూ సినిమా అప్డేట్స్  అందించే కిరణ్ అబ్బవరం తాజాగా తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ అభిమానులతో పంచుకున్నారు. 

ఇంతకీ విషయం ఏంటంటే.. కిరణ్ అబ్బవరం తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. తాజాగా గృహప్రవేశం కూడా పూర్తి చేశారు. ఇంట్లోకి వెళ్తున్న సందర్భంగా అభిమానుల కోసం ఓ వీడియోను పంచుకున్నారు. గృహ ప్రవేశం కార్యక్రమాల్లో తన ఫ్రెండ్స్, టీమ్ తో కలిసి పనిచేస్తున్న వీడియోను ఫ్యాన్స్ కోసం వదిలారు. తన డ్రీమ్ హౌజ్ లోకి వెళ్లినందుకు సంతోషించారు. 

అయితే, ఈ ఇల్లును ఎక్కడ నిర్మించడానేది ఆసక్తికరంగా మారింది. స్వచ్ఛమైన పల్లెటూరు, తనకు ఇష్టమైన ప్రదేశంలో కొత్త ఇంటిని నిర్మించారు కిరణ్ అబ్బవరం. ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటీ, పెద్దకల్వపల్లెకు చెందిన కిరణ్ తన సొంతూరిలో కలల ఇంటిని అన్ని హంగులతో నిర్మించారు. విశాలమైన గదులు, ఆకర్షణీయమైన ఫర్నీచర్ తో సొంతింటిని తన అభిరుచులకు అనుగుణంగా నిర్మించారు. దీంతో కిరణ్ కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుతున్నారు. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే... కిరణ్ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఈ ఏడాది రెండు సినిమాలు ‘వినరో భాగ్యమూ విష్ణు కథ’, ‘మీటర్’తో అలరించారు. కాస్తా మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) చిత్రంతో రాబోతున్నారు. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి కథానాయిక. అభిమాన్యు సింగ్, వెన్నెల కిషోర్, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. గణేష్ ఉత్సవాలతోనే సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించారు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios