Asianet News TeluguAsianet News Telugu

కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమాకి మతిపోయే టైటిల్‌.. `ఆపరేషన్‌ రావణ్‌` ట్రైలర్‌ ఇంట్రెస్టింగ్‌..

కిరణ్‌ అబ్బవరం రూట్‌ మార్చాడు. సరికొత్త కథలతో రాబోతున్నాడు. ఇప్పుడు `క` పేరుతో కొత్త సినిమా ప్రకటించారు. మరోవైపు `ఆపరేషన్‌ రావణ్‌` ట్రైలర్‌ విడుదలైంది. ఇది క్రేజీగా ఉంది.
 

kiran abbavaram new film title Ka and operation raavan movie trailer interesting arj
Author
First Published Jul 11, 2024, 12:13 AM IST

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం డిఫరెంట్‌ మూవీస్‌తో ఆకట్టుకుంటున్నాడు. `ఎస్‌ఆర్ కళ్యాణమండపం`తో అలరించిన ఆయన ఇప్పుడు సరికొత్త మూవీతో రాబోతున్నాడు. హీరోగా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే కథాంశంతో వస్తున్నారు. బలమైన కంటెంట్‌తో కూడిన చిత్రం చేస్తున్నారు. తాజాగా దీనికి టైటిల్‌ని ఖరారు చేశారు. `క` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అంతేకాదు ఇది పీరియాడికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. 1970లో సాగే కథగా తెలుస్తుంది. రా, అండ్‌ రస్టిక్‌గా, యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని సమాచారం. టైటిల్‌ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో కిరణ్‌ కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

`దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో "క" సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న "క" సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది` అని టీమ్‌ తెలిపింది. ఈ మూవీని  శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు.  

అదిరిపోయిన `ఆపరేషన్‌ రావణ్‌` ట్రైలర్.. 

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా `ఆపరేషన్ రావణ్`.  ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న `ఆపరేషన్ రావణ్` సినిమా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది. బుధవారం సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. హీరో విశ్వక్‌ సేన్‌ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా సాగుతూ ఆకట్టుకుంది. ఫ్రెష్‌ ఫీలింగ్‌నిస్తుంది. 

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, `ఆపరేషన్ రావణ్` సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. వెంకట సత్య గారు ఏదో చేయాలని డైరెక్షన్ చేసినట్లు ఎక్కడా అనిపించలేదు. చాలా ప్యాషన్ తో మూవీ చేశారని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ సినిమా ఫంక్షన్ కు నన్ను ఇన్వైట్ చేయడానికి రక్షిత్ వచ్చినప్పుడు మా నాన్నగారు డైరెక్ట్ చేశారని చెప్పారు. నేను కూడా మా నాన్నతో కలిసి మూవీస్ చేస్తుంటా. అలా నాకు రక్షిత్ రిలేట్ అయ్యాడు. `ఆపరేషన్ రావణ్` తో మరోసారి రిస్క్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. రక్షిత్ కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇక్కడ లాస్ట్ ఛాన్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకో ఛాన్స్ ఉంటుంది. మనం హోప్స్ వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. కాన్ఫిడెంట్ గా ట్రై చేయి తప్పకుండా సక్సెస్ వస్తుంది` అని అన్నారు.

డైరెక్టర్ వెంకట సత్య మాట్లాడుతూ , ఇప్పటిదాకా మీరు ఏ సినిమాలోనూ చూడని అంశాలు `ఆపరేషన్ రావణ్` చిత్రంలో చూపించబోతున్నాం. రాజమౌళి కూడా ఇలాంటి అంశాన్ని తెరపై చూపించలేదు. అదే మీ ఆలోచనలు. మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచి వాళ్లా చెడ్డ వాళ్లా అనేది నిర్ణయించడం జరుగుతుంది. మీ ఆలోచనలే మీరు ఎలా ఉండాలే డిసైడ్ చేస్తాయి. ఆ పాయింట్ తో “ఆపరేషన్ రావణ్” సినిమాను రూపొందించాను. ఫస్ట్ టైమ్ మీ ఆలోచనలను విజువల్ గా తెరపై చూపించబోతున్నా. మా అబ్బాయిని డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. నేను డైరెక్టర్ ను కాబట్టి నా జాబ్, నేను చెప్పాలనుకున్న కథ మీదే ఫోకస్ చేశాను. రక్షిత్ బాగా నటించాడు. మనలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. మంచివీ చెడ్డవి. చెడ్డవాటిని మంచివి డామినేట్ చేస్తే మంచోళ్లుగా ఉంటాం. మంచి ఆలోచనలను చెడ్డ ఆలోచనలు డామినేట్ చేస్తే చెడ్డవాళ్లుగా మారుతాము. మంచి ఆలోచనలు ఉన్న రాముడు దేవుడు అయితే చెడు ఆలోచనలతో రావణుడు రాక్షసుడిగా వధించబడ్డాడు` అని తెలిపారు దర్శకుడు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios