కిర్రాక్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు.. రేటు బాగా ఘాటు, ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన జబర్థస్త్ మాజీ కమెడియన్
జబర్థస్త్ నుంచి బయటకు వచ్చి..బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఆయన ఓపెన్ చేసిన కర్రీ పాయింట్స్ యమా జోరుగా సాగుతున్నాయి. అదే క్రమంలో ఆర్పీ కర్రీపాయింట్స్ పై కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
జబర్ధస్త్ ద్వారా ఎంతో గుర్తింపు సాధించాడు కిర్రాక్ ఆర్పీ.. తన మార్క్ నెల్లూరు కామెడీతో కడుపుబ్బా నవ్వించి అలరించాడు ఆర్పీ. ఇక జబర్థస్త్ నుంచి బయటకు వచ్చిన తరువాత తనకు గుర్తింపు ఇచ్చిన జబర్ధస్త్ పైన ఎన్నో ఆరోపణలు కూడా చేశాడు. ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలి అని చాలా ప్రయత్నించాడు ఆర్పీ. జెడి చక్రవర్తి హీరోగా సినిమా కూడా చేశాడు. కాని ఆర్పీ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. ఇక ఇండస్ట్రీతో లాభం లేదు అనుకుని.. బయటకువచ్చి బిజినెస్ ఐడియాతో దూసుకుపోతున్నాడు.
కమెడియన్ గా నెల్లూరు యాసను ఎలా ఉపయోగించుకున్నాడో.. ఈసారి అదే నెల్లూరు ఫేమస్ డిష్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లో ఒక్క బ్రాంచ్ తో స్టార్ట్ చేసి.. సక్సెస్ ఫుల్ గా నాలుగైదు బ్రాంచ్ లతో రెండు తెలుగు రాష్ట్రాలలో తన బిజినెస్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ డిష్ ఫేమస్ అవ్వడానికి ఆర్పీకి ఉన్న జబర్థస్త్ ఇమేజ్ బాగా ఉపయోగపడింది అనేది అందరికి తెలిసిన సత్యం.
ఈక్రమంలో కిర్రాక్ఆర్పీ కర్రీపాయింట్స్ మీద.. అతను చేసే చేపల పులుసు మీద మొదటి నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది అందులో ఏమీ లేదని.. పెద్దగా చెప్పుకోడానికి అంత టేస్ట్ లేదని... కాస్ట్ ఎక్కువని.. ఇలా రకరకాల వాదనలువినిపించాయి. అయితే వాటిపై ఓ సారి స్పందించారు ఆర్పీ.. అంది తనను వెనక్కి నెట్టి ఎదగనీయకుండా చేయాలని శత్రువులు చేస్తున్న కుట్ర అన్నారు. ఇక తాజాగా మరోసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కాస్ట్ గురించి ఆరోపణలు బయటకు వచ్చాయి.
అయితే నెల్లురు చేపల పులుసు రేటు గురించి తాజాగా స్పందించాడు ఆర్పీ.. ఆయన ఏమన్నారంటే..? మీరు కిలో చికెన్ కొంటే కిలో చేతిక వస్తుంది. మటన్ కూడా అంతే. కానీ కిలో చేప తీసుకుంటే మాత్రం కిలో రాదు. తల కాయ, తోకా పోతాయి. మధ్యలో ఉండే పీసులే నేను కూరగా అమ్మాలి. ఇతర కూరల్లో వేసిన దానికి వంద రెట్లు ఎక్కువగా చేపల కూరలో నూనే వేయాలి. రుచి కోసం మామిడి కాయలు కూడా జత చేయాలి. అవి కూడా చాలా రేటు ఉంటాయి కదా. పైగా అన్ని సీజన్లలో దొరకవు.
అంతే కాదు వాటిలో వేసే మసాల కూడా చాలా రేటు ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆఖరిలో వేసే మసాలా, కొత్తిమీర.. ఇలా అన్నీ కాస్ట్లీ కదా.. ఇది కాక చేపల పులుసుకు.. ఇతర కూరలకంటే ఎక్కువ నూనె వాడాలి. వాటితో పాటు బ్రాంచ్ మెయింటేనెస్, జీతాలు, గ్యాస్, టాక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇతర వాటికంటే ఎక్కువే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక అందరు ఎలా అమ్ముతున్నారు అంటే.. వారికి వీటితో పాటు ఇతరాలు కూడా అమ్ముతారు. కానీ నేను చేపల పులుసు మాత్రమే అమ్ముకోవాలి.. చాలా మంది... క్వాలిటీ లేకుండా.. నాన్యత లేని అల్లు వెల్లుల్లి వేసి వేపి ఇస్తారు.. కాని నేను చాలా క్వాలిటీగా చేపల పులుసు ఇస్తున్నాను.. అందుకు తగ్గట్టుగానే ధరలుఉన్నాయి అన్నారు.
అంతే కాదు ఎవరూ కూడా కావాలని అత్యధిక రేట్లు పెట్టరు. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల వ్యాపారం జరగదు అని తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను. ఇది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. నేను కూడా నాసిరకమైన చేపలు తెచ్చి వండటం లేదు. మీరు మంచి చేపలు తిని బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి రేట్లు అలా పెట్టవలసి వస్తుంది’ అంటూ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు రేట్లపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు కిర్రాక్ ఆర్పీ.