Asianet News TeluguAsianet News Telugu

కుండ బద్దలు కొట్టి ప్రశాంత్ కి కనువిప్పు కలిగించిన నాగ్.. మా నాన్న ఊరోడు, గర్వంగా చెప్పిన కింగ్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇక వీకెండ్ వచ్చేసింది కాబట్టి శనివారం ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. 

King Nagarjuna told prashanth about his father ANR at Bigg Boss House dtr
Author
First Published Oct 21, 2023, 3:39 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇక వీకెండ్ వచ్చేసింది కాబట్టి శనివారం ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. వీకెండ్ సాటర్ డే ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేసేలా తాజాగా బిగ్ బాస్ తెలుగు 7 ప్రోమో విడుదలయింది. 

ప్రోమో చూస్తుంటే శనివారం రోజు నాగ్ ఇంటి సభ్యులందరికి ఒక రౌండ్ క్లాస్ పీకినట్లు అర్థం అవుతోంది. అంతే కాదు ఇంటి సభ్యుల ఫోటోలు ఉన్న కుండలు బద్దలు కొట్టి వారు చేసిన తప్పులని నాగ్ ఎత్తి చూపిస్తున్నారు. 

ముందుగా నాగార్జున అశ్వినికి వార్నింగ్ ఇచ్చారు. ఆమె కుండ బద్దలు కొట్టి నీ మాటతీరు బాగాలేదని నాగ్ చెప్పారు. ఇక హౌస్ లో గ్రూపిజం సాగుతోందా అంటూ శోభా శెట్టిని కూడా నాగ్ మందలించినట్లు ఉన్నారు. ఇక ఊరోడు అనే మాట విషయంలో నాగార్జున ప్రశాంత్ మధ్య పెద్ద చర్చే జరిగింది. ఊరోడు అనడం తప్పా అని నాగ్ ప్రశాంత్ ని ప్రశ్నించారు. 

అందరూ ఊరి నుంచే వచ్చారు. ప్రస్తుతం అందరికి తిండి పెడుతోంది ఊరే అని నాగార్జున అన్నారు. నేను గర్వంగా చెబుతున్నా మా నాన్న ఊరోడు అంటూ నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ గురించి వేదికపై చేసిన వ్యాఖ్యలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. అదే విధంగా ఫన్నీ గేమ్స్ కూడా సాగాయి. ఇంటి సభ్యులతో నాగ్ పాము, నిచ్చెన అంటూ వైకుంఠ పాళీ ఆడించారు. 

ఒక్కొక్కరిని పిలిచి ఇంట్లో నిచ్చెన లాంటి వ్యక్తి ఎవరు.. పాము ఎవరు అని నాగ్ ప్రశ్నించారు. ముందుగా అశ్విని బదులిస్తూ హౌస్ లో శోభా శెట్టి మింగేసే పాము లాంటిది అని హాట్ కామెంట్స్ చేసింది. సాటర్ డే ఎపిసోడ్ పూర్తిగా ఎలా సాగిందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios