కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఆదివారం రోజు సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ కానుంది. మూడవ సీజన్ నుంచి నాగార్జునే తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఆదివారం రోజు సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ కానుంది. మూడవ సీజన్ నుంచి నాగార్జునే తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్స్ దారుణంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనితో ఈ సీజన్ ని నిర్వాహకులు డిఫెరెంట్ గా ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్స్ లో కూడా నాగార్జున ఉల్టా పల్టా అంటూ సందడి చేస్తున్నారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ రూల్స్ మొత్తం మార్చేసి ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చే వినోదం రెడీ చేస్తున్నారట. 

మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభం కాబోతుండడంతో సోషల్ మీడియాలో అనేక విశేషాలు వైరల్ గా మారాయి.దీనికి తోడు నిర్వాహకులు ప్రోమోలు రిలీజ్ చేస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో పెద్ద ట్విస్టులే కనిపిస్తున్నాయి. 

సీజన్ 7 గ్రాండ్ ఓపెనింగ్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి అతిథులుగా హాజరు కానున్నారు. ఆటపాటలతో హంగామా చేయబోతున్నారు. ఇంకా సెలెబ్రిటీలు ఎవరెవరు వస్తారనేది ఇప్పటికి సస్పెన్స్. విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి చిత్రం రీసెంట్ గా విడుదలై మంచి విజయం దిశాగా దూసుకుపోతోంది. 

అయితే వేదికపై నాగార్జున పెద్ద షాక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ మాత్రమే స్టేజిపైకి వచ్చాడు. దీనితో నాగార్జున ఏది మీ హీరోయిన్ సమంత ఎక్కడ అని మాజీ కోడలి గురించి కింగ్ ఆరా తీయడం షాకింగ్ గా మారింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీనికి విజయ్ దేవరకొండ ఎలాంటి సమాధానం ఇచ్చాడు.. నాగార్జున తిరిగి సమంత గురించి ఇంకా ఏమేం మాట్లాడారు అనేది తెలియాలంటే బిగ్ బాస్ 7 లాంచ్ వరకు ఆగాల్సిందే. 

Scroll to load tweet…

నాగార్జున సమంత గురించి మాట్లాడడంతో ఫ్యాన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సమంత.. నాగ చైతన్య ఫ్యాన్స్ తరచుగా సోషల్ మీడియాలో గొడవ పడుతుండడం చూస్తూనే ఉన్నాము. దీనితో వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు.. మధ్యలో మీరెందుకు సోషల్ మీడియాలో గొడవలు పడుతుంటాయారు అని కామెంట్స్ పెడుతున్నారు. 

Scroll to load tweet…

నాగ చైతన్య, సమంత 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ నాగార్జున ఇప్పుడు ఏకంగా వేదికపై సమంత గురించి ఆరా తీయడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ గురించి అనేక ఆసక్తికర రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సాయంత్రానికి బిగ్ బాస్ 7 కి సంబంధించిన సస్పెన్స్ వీడనుంది.