Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 5: హౌస్ లోకి నాగ్ ఎంట్రీ.. డిజైన్ అదిరిపోయింది, మోజ్ రూమ్ అంటూ సర్ ప్రైజ్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. నాగార్జున ఇప్పుడే హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ని సరికొత్తగా డిజైన్ చేశారు.

King Nagarjuna gives entry into Beautiful Bigg Boss House
Author
Hyderabad, First Published Sep 5, 2021, 6:30 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. నాగార్జున ఇప్పుడే హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ని సరికొత్తగా డిజైన్ చేశారు. 70 కెమెరాలతో బిగ్ బాస్ షోని మానిటరింగ్ చేస్తున్నట్లు నాగార్జున వివరించారు. అవే బిగ్ బాస్ కళ్ళు. 

ఇక నాగార్జున హౌస్ లోకి ప్రవేశించి ఒక్కో ప్రదేశాన్ని వివరించారు. గత నాలుగు సీజన్స్ కంటే భిన్నంగా కళ్ళు చెదిరే విధంగా బిగ్ బాస్ హౌస్ ని డిజైన్ చేశారు. హౌస్ మొత్తం రంగు రంగుల డిజైన్స్ తో అదిరిపోయింది. 

స్విమ్మింగ్ పూల్, యాక్టివిటీ ఏరియా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇక వాష్ రూమ్ అయితే అక్కడ ఉండే అద్దం కూడా ఆకర్షించే విధంగా ఉంది. ఈ సారి మోజ్ పేరుతో కొత్త రూమ్ ని డిజైన్ చేశారు. చూడడానికి ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎక్స్ట్రా వినోదం అందిస్తారని నాగ్ అన్నారు. 

కంటెస్టెంట్స్ అంతా అసెంబుల్ అయ్యే సోఫా అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంది. కిచెన్ కూడా కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios