కింగ్ నాగార్జున జోరు మీద ఉన్నాడు. యంగ్ హీరోలను మించి దూసుకుపోతున్నాడు. తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో దూకుడ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఘోస్ట్ మూవీ ఆపరేషన్ లో భాగంగా.. ఊటీ వెళ్ళాడు కింగ్. 

కింగ్ నాగార్జున జోరు మీద ఉన్నాడు. యంగ్ హీరోలను మించి దూసుకుపోతున్నాడు. తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో దూకుడ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఘోస్ట్ మూవీ ఆపరేషన్ లో భాగంగా.. ఊటీ వెళ్ళాడు కింగ్. 

నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ గా నటిస్తోన్న సినిమా ది ఘోస్ట్‌. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను.. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్ను మేకర్స్. రీంట్ గా దుబాయ్‌లో కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఘోష్ట్ మూవీ... తాజా షెడ్యూల్‌ ను ఊటీలో స్టార్ట్ చేశారు. 

Scroll to load tweet…

ఊటీ షెడ్యూల్‌లో నాగార్జున తో పాటు హీరోయిన్ సోనాల్‌ చౌహాన్‌పై ఇంపార్టెన్ట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరూ.. ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపించబోతున్నారు. ఓ ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి వారు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు ఏంటీ అనేది సినిమా కథ. థ్రిల్లర్ కథాంశంతో.. ఉత్కంఠ భరితంగా సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ సరికొత్తగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 

ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి..ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు ట్వీట్‌ చేశారు. ఊటీలో షూటింగ్ స్టార్ట్ అవుతుందంటూ ఆయన ఈ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఇక గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పరుగుతు పెట్టిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారు.