కిమ్ శర్మకు డబ్బుల్లేవని పుకార్లు గత కొంత కాలంగా కిమ్ భర్తతో కలిసుండట్లేదని వార్తలు తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని ట్వీట్ చేసిన కిమ్ శర్మ

ఖడ్గం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై..మగధీరతో అభిమానం సంపాదించుకుంది కిమ్ శర్మ. తాజాగా నటి కిమ్‌ శర్మ భర్త అలీ పంజానీతో విడిపోయిందని.. ప్రస్తుతం ఆర్థికంగా కష్టాలు పడుతోందని కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. దీనిపై స్పందించిన కిమ్‌ శర్మ అవన్నీ వట్టి పుకార్లేనని ట్విటర్‌ ద్వారా స్పష్టం చేసింది. అసలు ఏమీ జరగకుండానే వార్తలు కల్పిస్తున్నారంటూ మండిపడింది.

‘వీకెండ్‌ కావడంతో శనివారం థాయ్‌లాండ్‌లో ఎంజాయ్‌ చేసి ఇంటికి వస్తే నా చేతిలో డబ్బుల్లేవంటూ వార్తలు వస్తున్నాయి. అయినా నా గురించి నా కంటే వేరే వాళ్లకే బాగా తెలుసేమో. ఏదేమైనా నా గురించి వస్తున్నవన్నీ పుకార్లే’ అని ట్వీట్‌ చేసింది కిమ్‌ శర్మ.

2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అలీ పంజానీని వివాహం చేసుకుంది కిమ్. ఇప్పుడు అలీ వేరే అమ్మాయి మాయలో పడి కిమ్‌ని వదిలేశాడని.. దీంతో ఆమె కెన్యా నుంచి ముంబయి వచ్చేసిందని.. ఆర్థికంగా కష్టాలు పడుతోందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన కిమ్ నాకు డబ్బులు లేకల పోవడమేంటని శివాలెత్తింది.