బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. కొన్నేళ్ల క్రితం ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ అతడికి దూరమైంది.

గత కొంతకాలంగా నటుడు హర్షవర్ధన్ రానేతో డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనుకునేలోపు బ్రేకప్ అయిపోయింది. ఈ విషయాన్ని హర్షవర్ధ్హన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇంతకముందు లవ్ లో బ్రేకప్ అయితే డిప్రెషన్ లోకి వెళ్లడం, బాధపడుతూ ఉండడడం చేసేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బ్రేకప్ తరువాత ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇప్పుడు కిమ్ శర్మ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నానని తన ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతోంది.

గత నాలుగు రోజులుగా తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళుతూ సమయం గడుపుతోన్న ఈ భామ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో బికినీ ఫోటో షేర్ చేసింది. వైట్ కలర్ బికినీ, గాగుల్స్ పెట్టుకొని చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Come away with me 🌊 #friyay

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on Apr 25, 2019 at 11:30pm PDT