కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం పహిల్వాన్ . భాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ , తెలుగు, కన్నడ,తమిళ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానుంది.సుదీప్ ఈ మూవీ కోసం బాగా కష్టపడుతున్నాడు. అదే స్దాయిలో ప్రమోషన్ సైతం చేస్తున్నారు. అందులో  భాగంగా పహిల్వాన్ మూవీ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ట్రైలర్ ని విడుదల చేసారు.   ఈ చిత్రాన్ని ఎస్. కృష్ణ నిర్మిచడంతో పాటు దర్శకత్వం వహించారు.

బ‌లం ఉంద‌నే అహంతో కొట్టేవాడు రౌడీ..బ‌ల‌మైన కార‌ణం కోసం కొట్టేవాడు యోధుడు అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. త‌న కలని సుదీప్ ఎలా నెరవేర్చుకున్నాడో సినిమా చూస్తే అర్దమ‌వుతుంది.ఈ  ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.  

ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప‌లు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా సుదీప్‌ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహాన్‌సింగ్‌ విలన్ పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే నిపుణున్ని కూడా పిలిపించారు.