పహిల్వాన్ చిత్రం సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. ఎస్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియన్ ఫిలిం గా తెరకెక్కుతున్న పహిల్వాన్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సుదీప్ దర్శకధీరుడు రాజమౌళిని ప్రశంసించాడు. పహిల్వాన్ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా  విడుదలవుతోంది అంటే అందుకు కారణం రాజమౌళి అని తెలిపాడు. రాజమౌళి ఈగ, బాహుబలి చిత్రాన్ని నన్ను నార్త్ ప్రేక్షకులకు కూడా చేరువ చేశాయి. 

రాజమౌళి గారు సౌత్ చిత్రాలకు ఉన్న బౌండరీలని చెరిపేశారు. బాలీవుడ్ లో సౌత్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయంటే ఆ క్రెడిట్ రాజమౌళిదే అని సుదీప్ అభిప్రాయ పడ్డాడు. పహిల్వాన్ చిత్రంలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.