బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్లిక్కవ్వాలంటే లక్కు డోస్ మాములుగా ఉండకూడదు. అయితే కొంత మందికి ఉండే సెంటిమెంట్ ఏమిటంటే టాలీవుడ్ లో ఒక మంచి సినిమా చేస్తే చాలు ఆ తరువాత బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ అందుకోవచ్చని అనుకుంటారు. ప్రస్తుతం అదే తరహాలో సెంటిమెంట్ తో క్లిక్కవుతున్న బ్యూటీ కియారా అద్వానీ. 

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ముద్దగుమ్మ నార్త్ లో బడా సినిమాల్లో అవకాశం అందుకుంటోంది. తెలుగులో భరత్ అనే నేను సినిమాతో సాలిడ్ హిట్టందుకున్న అమ్మడు వెంటనే వినయ విధేయ రామ సినిమాతో మెరిసింది. ఇక ఇటీవల కబీర్ సింగ్ కూడా హిట్టవ్వడంతో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో అక్కడి స్టార్ హీరోయిన్స్ కి షాకిస్తోంది. 

రీసెంట్ గా అక్షయ్ కుమార్ తో కాంచన రీమేక్ లో నటించేందుకు ఒప్పుకున్న అమ్మడు మరో హారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుల్ బులియా 2 అనే మరో హారర్ కామెడీ సినిమాలో చంద్రముఖిగా కనిపించడానికి ఒప్పుకుంది. 2007లో బుల్ బిలియా (చంద్రముఖి రీమేక్) సినిమాతో అక్షయ్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ కథకు ఇప్పుడు మరో సీక్వెల్ ని ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.