బాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఎన్నాళ్ల నుంచో నార్త్ లో నానుతున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వాని, హీరో సిద్థార్ద్ మల్హోత్ర పెళ్ళి వేడుకకు బాలీవుడ్  ముస్తాబయ్యింది.  


బాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇన్నాళ్ళు జనాలను కన్ ఫ్యూజన్ లో పెట్టి.. ప్రేమాయణం సాగించిన కియారా,సిద్థార్ద్ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గతకొంత కాలంగా బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తున్న కియరా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రాల పెళ్ళి ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 6న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని ఓ ప్యాలేస్‌లో వీరిద్ధరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరిపెళ్లిని అంగరంగా వైభవంగా జరగబోతుంది. రెండు కుటుంబాల అనుమతితో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. 

ఇక తాజాగా కియారా అద్వానీ తన కుటుంబంతో కలిసి జైసల్మేర్‌కు బయలుదేరింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ స్టార్ల ఇద్దరి పెళ్లి ప్లానింగ్ చూసుకున్నట్టయితే.. ఫిబ్రవరి 4,5 తేదిల్లో మెహెందీ, హల్దీ ఫంక్షన్‌లు జరుగబొతన్నాయి. 6 తేదీన పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు .. కొంత మంది బాలీవుడ్‌ ప్రముఖ సినీ నటులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. అందులో రామ్ చరణ్ కూడా ఉన్నారని వినికిడి. 

Scroll to load tweet…

పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలలో వివాహ రిసెప్షన్లను గ్రాండ్‌గా ఏర్పాటు చేయనున్నట్లు టాక్‌. వీరిద్ధరూ మొదటి సారి షేర్షా సినిమాలో కలిసి నటించారు. ఇక షూటింగ్‌ టైమ్‌లో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని వీరిరువురూ పలు సందర్భాల్లో స్ట్రేయిగ్‌గా చెప్పకపోయినా.. హింట్ లాంటివి ఇచ్చారు. కరణ్ హోహార్ షోలో కూడా వీరిద్దరి రిలేషన్ విషయంలో కామెంట్లు వినిపించాయి. అయితే ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడ్డారు జంట. కాని మీడియాలో మాత్రం విసృతంగా ప్రచారం జరిగింది.