అత్తవారింట అడుగుపెట్టిన కియారా అద్వాని, కొత్తకోడలికి ఘనంగాస్వాగతం పలికిన సిద్థార్ధ్ ఫ్యామిలీ
అత్తవారింట కుడికాలు పెట్టింది హీరోయిన్ కియారా అద్వాని. సిద్దార్థ్ మల్హోత్రా ను పెళ్ళాడిన స్టార్ హీరోయిన్ పుట్టింటినుంచి మెట్టినింటికి వెళ్ళిపోయింది.

బాలీవుడ్ లవ్ కపుల్స్ సిద్దార్థ్ మల్హోత్రా , కియారా అద్వాని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ విషయంలో ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడ్డ ఈ కపుల్.. పెళ్లి కూడా ఎవరి కంట పడకుండా.. పక్కాగా ప్రైవేట్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ నెల 7న రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో.. ఒక్కటయ్యారు ఇద్దరు స్టార్లు. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ నుంచి కొంత మంది అతిథుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ కపుల్.
ఇక పెళ్లి తరువాత సిద్ధార్థ్ కొత్త పెళ్లి కూతురుతో కలిసి తొలిసారిగా ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నాడు. కియారా అద్వాని మొదటిసారిగా తన అత్తవారింట అడుగు పెట్టింది. తొలిసారి తమ ఇంటికి వచ్చిన కొత్త కోడలికి అత్తవారు గ్రాండ్ గా వెల్కం చెప్పారు. నవ వధువు కియారాకు అత్తవారింట్లో పూలవర్షం కురిపిస్తూ.. మంగళ వాయిద్యాల నడుమా.. స్టెప్పులేస్తూ.. ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌తో పాటు కియా కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెళ్లితో ఒక్కటైన కియారా, సిద్దార్థ్ దంపతులకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా దంపతులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి చాలా తక్కువ మంది మధ్య చేసుకోవడంతో.. రిసెప్షన్ ను ఘనంగా జరుపబోతున్నట్టు తెలుస్తోంది. ముంబయ్ తోపాటు.. ఢిల్లీలో కూడా ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.