తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో పరిచయమైన కియారా అద్వానీ ఆ తరువాత 'వినయ విధేయ రామ' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె నటించిన 'కబీర్' సింగ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

'అర్జున్ రెడ్డి' రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా తన ప్రేమ కబుర్ల గురించి చెప్పుకొచ్చింది. పదవ తరగతిలోనే ఒక అబ్బాయిని సిన్సియర్ గా ప్రేమించానని చెప్పి షాక్ ఇచ్చింది కియారా.

కానీ తన తల్లి చదువుపై దృష్టి పెట్టమని మందలించడంతో అతడికి బ్రేకప్ చెప్పినట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు తనకు ప్రేమించడానికి సమయం లేదని అంటోంది. తన కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలిపింది. చాలా కాలంగా బాలీవుడ్ లో ఆమె నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై స్పందించిన ఆమె వాటిల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. మొదట్లో ఇలాంటి వార్తలు చదివినప్పుడు అప్సెట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు అవి చదువుతూ నవ్వుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు కామన్ అని వెల్లడించింది.