మహేష్ తో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ కైరా అదాని. అయితే ఆమెకు సినిమాల కన్నా సోషల్ మీడియా మీదే ఎక్కవ కాన్సర్టేషన్ ఉన్నట్లుంది. ఎప్పటకప్పుడు ఏదో ఒక వివాదంతోనో, నినాదంతోనే రచ్చ చేస్తూంటుంది. ముఖ్యంగా ఆమె టాప్ లెస్ ఫొటో పోస్ట్ చేసాక విపరీతమైన విమర్శలు వచ్చాయంటోంది. ఆ ఫొటోలో ఆమె ఆకు వెనక దాక్కుంది. ఈ బోల్డ్ ఫొటో ఇనిస్ట్రగ్రమ్ లో షేర్ చేసింది.

డబు రత్నాని చేసిన ఈ ఫొటో షూట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన మెమోస్ వచ్చాయి. అయితే అందులో భీబత్సమైన బూతు మెసేజ్ లు ఉండటం ఆమెను షాక్ కు గురి చేసిందిట. తన కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి సమస్యను ఫేస్ చేయలేందంటోంది. రీసెంట్ గా ట్వీక్ ఇండియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం ప్రస్దావించింది. నేను ఆ ఫొటో పెట్టాక ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యాల్సి వచ్చింది. ఇలాంటి ఫొటో షూట్ లు చెయ్యకుండా ఉండాల్సింది అనిపించింది. చాలా మంది వల్గర్ మెసేజ్ లు పంపండం మొదలెట్టారు.  అయితే అవి కొంతవరకే అని, తర్వాత లైట్ తీసుకుంటానని తేల్చి చెప్పింది. తను చేసిన వెబ్ సీరిస్ లస్ట్ స్టోరీస్ సమయంలోనూ ఇలాంటి కొన్ని వల్గర్ మెసేజ్ లు ఎదుర్కోవాల్సి వచ్చిందని అంది.

ఇక కైరా ...హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో వున్నా, వెబ్‌ సిరీస్‌లను మాత్రం వదలడంలేదు. రీసెంట్ గా ఆమె చేసిన ‘గిల్టీ’ వెబ్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ‘గిల్టీ’ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఓ సెన్సేషన్ గా మారింది. ఎంత క్యూట్‌గా కన్పించినా, బోల్డ్‌ రోల్స్‌ చేయడంలో కైరా అద్వానీ రూటే సెపరేటు అని ఆ వెబ్ సీరిస్ ప్రూవ్ చేసింది. ఆ మధ్య ‘లస్ట్‌ స్టోరీస్‌’లో ఆమె చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌ ని ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు.

ఇక సినిమాకీ, వెబ్‌ సిరీస్‌కీ పెద్దగా తేడా ఏమీ లేదనీ, మేకింగ్‌ కాస్త వేగంగా వెబ్‌ సిరీస్‌ల విషయంలో జరుగుతుందనీ, కష్టం మాత్రం సినిమాకైనా, వెబ్‌సిరీస్‌కి అయినా ఒకటేనని కైరా అద్వానీ అభిప్రాయపడింది. సినిమాలకు ఆదరణ తగ్గదనీ, అదే సమయంలో వెబ్‌ సిరీస్‌లకు మాత్రం ఆదరణ విపరీతంగా పెరుగుతోందనీ, ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పుని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కైరా అద్వానీ చెప్తోంది.