బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చిరాకుతో తన జుట్టుని తనే కత్తిరించేసుకుంది. సాధారణంగా అమ్మాయిలు జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటిది కియారా మాత్రం విసుగుపుట్టి తన జుట్టు తనే కత్తిరించుకొని ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న ఈ ఆధునిక రోజుల్లో తనకు నచ్చిన విధంగానే తానున్తానని చెబుతూ ఈ వీడియో పోస్ట్ చేసింది. తన కజిన్ పెళ్లికి వెళ్లేప్పుడు తన తల్లి ట్రెడిషనల్ గా చీర కట్టుకోమని తెలిపిందని, అయితే తాను మాత్రం మార్కెట్ లో దొరికే రెడీమేడ్ సారీతో ఆ పని చేశానని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

ఇక బిజీ షెడ్యూల్స్ తో క్షణం తీరిక లేని ఈరోజుల్లో జుట్టు పెంచుకోవడం,  దానికి నూనె రాసుకోవడం చిరాకుగా ఉందని తెలిపి వెంటనే కత్తెర తీసుకొని జుట్టు కత్తిరించేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. కియారా తెలుగులో నటించిన 'వినయ విధేయ రామ' పెద్దగా క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'లో నటిస్తోంది. అలానే లారెన్స్ తెరకెక్కిస్తోన్న 'లక్ష్మీ బాంబ్' సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.