మామూలుగా రవితేజ సినిమా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్, మాస్, కామెడీకి ఏమాత్రం లోటు ఉండదు. పైగా ఈ సారి కొత్త హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. రవితేజ సినిమా కావడం,
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రీసెంట్ గా రిలీజైన చిత్రం ‘ఖిలాడి’. జయంతిలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర చేయగా.. మురళి శర్మ, సచిన్ కేడ్కర్, ఉన్ని ముకుందన్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిజాస్టర్ టాక్ మార్నింగ్ షోకే వచ్చింది. అయితే రిలీజ్ అయ్యిన నెల కూడా పూర్తికాకుండానే ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యిపోయింది. దాంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాని విడుదలైన 28 రోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా అందుబాటులోకి తెస్తున్నారు. మార్చి 11న ఖిలాడీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ వారు అధికారికంగా ప్రకటించారు.
ఇక మామూలుగా రవితేజ సినిమా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్, మాస్, కామెడీకి ఏమాత్రం లోటు ఉండదు. పైగా ఈ సారి కొత్త హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. రవితేజ సినిమా కావడం, ఇద్దరు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నారనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక చతికిల పడింది. రవితేజ ఖాతాలో మరో ఫెయిల్యూర్ జమైంది.
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగిన గందరగోళ చిత్రమిది. పాటలు, ఫైట్స్ ఉంటే చాలని అనుకునే ప్రేక్షకులు ఓసారి వెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. రీమేక్ సినిమా 'రాక్షసుడు'తో విజయం అందుకున్న రమేష్ వర్మ ట్రాక్ రికార్డు చూస్తే... స్ట్రయిట్ సినిమాలతో విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువ. రవితేజతో గతంలో ఆయన తీసిన 'వీర' ఆశించిన విజయం అందుకోలేదు. 'ఖిలాడి' (Khiladi Movie) ఆ సినిమా సరసన చేరింది. మరి ఓటిటిలో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కాకపోతే థియేటర్స్ లలో ఎక్కువ మంది చూడలేదు కాబట్టి ఓటీటిలో ఓ లుక్కేస్తారని అంచనా వేస్తున్నారు.
