నెక్ట్స్ సినిమాకి సంబంధించిన గత రెండేళ్లుగా యష్‌ కథలు వింటూనే ఉన్నారు. కానీ ఏదీ ఫైనల్‌ చేయలేదు. ఈ నేపథ్యంలో కొత్త మరో క్రేజీ న్యూస్‌ వినిపిస్తుంది. యష్‌ నెక్ట్స్‌ సినిమాని కమిట్‌ అయ్యారనేది ఈ వార్త సారాంశం. అయితే యష్‌ చేయబోయేది లేడీ డైరెక్టర్‌తో అట.

కన్నడ రాకింగ్‌ స్టార్‌, `కేజీఎఫ్‌` ఫేమ్‌ యష్‌.. ఇప్పటి వరకు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. `కేజీఎఫ్‌2` వచ్చి ఏడాది దాటిపోయినా కొత్త సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నెక్ట్స్ సినిమా `యష్‌19`పై చాలా రూమర్స్‌ వచ్చినా, ఏదీ ఫైనల్‌ కాలేదు. ఆ మధ్య నర్తన్‌ పేరు బాగా వినిపించింది. కానీ ఈ ప్రాజెక్ట్ లేదని సమాచారం. ఈ నేపథ్యంలో యష్‌ నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి సినిమా చేస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారు? డైరెక్టర్‌ ఎవరు అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని సమాధానం మాత్రం లేదు. గత రెండేళ్లుగా యష్‌ కథలు వింటూనే ఉన్నారు. కానీ ఏదీ ఫైనల్‌ చేయలేదు.

ఈ నేపథ్యంలో కొత్త మరో క్రేజీ న్యూస్‌ వినిపిస్తుంది. యష్‌ నెక్ట్స్‌ సినిమాని కమిట్‌ అయ్యారనేది ఈ వార్త సారాంశం. అయితే యష్‌ చేయబోయేది లేడీ డైరెక్టర్‌తో అట. ఇదే ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు మలయాళ లేడీ డైరెక్టర్‌తో యష్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. `మూతన్‌` చిత్రంతో తానేంటో నిరూపించుకున్న లేడీ డైరెక్టర్‌ గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో యష్‌ సినిమా చేయబోతున్నారట. గీతూ మోహన్‌దాస్‌ దర్శకురాలు కంటే నటిగానే పాపులర్‌. ఆమె ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశారు. వీటికి స్టేట్‌ అవార్డులతోపాటు ఇంటర్నేషనల్‌ అవార్డులు వరించాయి. 

ఈ నేపథ్యంలో యష్‌కి కథ చెప్పిగా, ఆయన ఓకే చెప్పారని, ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట. అయితే దీని బ్యాక్‌ డ్రాప్‌ తెలిస్తే పూనకాలు లోడింగ్‌ అనేలా ఉంటుందంటున్నారు. మరోసారి యష్‌ మాఫియా కథతోనే వస్తున్నారట. ఇందులోనూ ఆయన గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తారట. అది మరింత బలంగా ఉంటుందని అంటున్నారు. `కేజీఎఫ్‌`తో వెయ్యి కోట్ల మార్కెట్‌కి పెరిగిపోయారు యష్‌. అంతేకాదు యష్‌పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు రీచ్‌ కావాలంటే మామూలు కథలు సెట్‌ కావని, అందుకే మాఫియా కథనే ఎంచుకున్నారట. `కేజీఎఫ్‌` తర్వాత మరోసారి యష్‌ గ్యాంగ్‌ స్టర్‌గా రచ్చ చేయబోతున్నారని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మించాలనుకుంటున్నారట.

ఇక గతేడాది ఏప్రిల్‌లో `కేజీఎఫ్‌2`తో వచ్చారు యష్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా `కేజీఎఫ్‌`కి రెండో భాగమనే విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 14న విడుదలై సంచలన విజయం సాధించింది. `ఆర్‌ ఆర్‌ ఆర్‌` రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇండియన్‌ సినిమా రికార్డులను షేక్‌ చేసింది. `బాహుబలి 2` తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. హోంబలే ఫిల్స్ దీన్ని నిర్మించిన విషయం తెలిసిందే.