`కేజీఎఫ్ 2` నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి రేపు శనివారం(జనవరి 8)న ఓ క్రేజీ అప్‌డేట్ ఇవ్వబోతుంది యూనిట్.
పాన్ ఇండియా సినిమాల్లో `బాహుబలి` తర్వాత ఆ స్థాయి క్రేజ్‌ని తెచ్చుకున్న సినిమా `కేజీఎఫ్`. మొదటి భాగం విడుదలై సంచలన విజయం సాధించింది. కన్నడంలో రూపొందిన ఓ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. `కేజీఎఫ్` కన్నడ పరిశ్రమ సత్తా ఏంటో చూపించింది. యష్ స్టయిలీష్ యాక్టింగ్ సినిమాకి పెద్ద అసెట్. మొదటి భాగం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సాధించడంతో రెండో భాగంపై ఆసక్తి నెలకొంది. ఇది ఇండియన్ గోల్డ్ మైనింగ్‌కి సంబంధించి కథ కావడం, యదార్థ సంఘటలుండటంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇక `కేజీఎఫ్ 2` నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి రేపు శనివారం(జనవరి 8)న ఓ క్రేజీ అప్‌డేట్ ఇవ్వబోతుంది యూనిట్. యష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం నుంచి శనివారం ఉదయం 9గంటలకు కొత్త పోస్టర్‌ని పంచుకోబోతుంది యూనిట్. రేపు యష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ఓ క్రేజీ ట్రీట్‌ని ఇవ్వబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. మరో కొత్త పోస్టర్ మాత్రమే కాదు, అంతకు మించి మరో ట్రీట్ రాబోతుందని తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం `కేజీఎఫ్2` ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది.
యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. ఇందులో సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.
