రీసెంట్ గా KGF సినిమాతో  నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యాష్ కన్నడ పొలిటికల్ ఫైట్ లోకి దిగాడు. ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయకుండా సీనియర్ నటి సుమలతకు మద్దతు పలుకుతూ మరో హీరోకి గట్టిపోటీని ఇస్తున్నాడు. అతనెవరో కాదు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ. 

రీసెంట్ గా ఒక హిట్ అందుకొని పాపులర్ అయిన ఈ జాగ్వార్ హీరో మాండ్యా లోక్ సభ స్థానానికి జేడీఎస్ పార్టీ నుంచి ఎన్నికల రంగంలో దిగుతున్నాడు. ఈ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు ఈ స్థానం నుంచి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. సుమలతకు రావాల్సిన అవకాశాన్ని కుమారస్వామి కొడుకు కోసం ప్రణాళికలు రచించారని టాక్ వస్తోంది. 

ఈ తరుణంలో kgf యాష్ సుమలతకు అండగా నిలిచారు. ఆమె ఇండిపెండెట్ గా పోటీ చేస్తుండగా ఎన్నికల ప్రచారంలో తనవంతు సహాయం చేయనున్నాడు. దీంతో కన్నడ సినీ ఫైట్ రాజకీయాల వరకు వెళ్ళింది. యాష్ కి అభిమానులు చాలా మందే ఉన్నారు. నిఖిల్ గౌడకి అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి లేదు గాని ఆ నియోజక వర్గంలో పార్టీ బలంగా ఉండటం సుమలత విజయం దక్కడం కష్టమని అంటున్నారు. 

అందుకే యాష్ ప్రచారంలో దిగి ప్రత్యర్థి హీరో నిఖిల్ ను ఓడించాలని సిద్దమవుతున్నాడు. గతంలో యష్ పలు ప్రాంతాల్లో పేదవారికి ఆర్థిక సహాయాన్ని అందించిన మంచి గుర్తింపు ఉండడంతో యాష్ ప్రచారం చేస్తే సుమలతకు గెలుపు దక్కడం పెద్ద కష్టమేమి కాదు అనే విధంగా మరో టాక్ వైరల్ అవుతోంది. ఈ తరుణంలో నిఖిల్ గౌడ - యష్ అభిమానుల మధ్య శత్రుత్వం గట్టిగానే నెలకొంది. మరి మాండ్యాలో ఏ హీరోకి జనాలు మద్దతు పలుకుతారో చూడాలి.