బాహుబలి సినిమా తరువాత జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్. పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో యష్‌ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కేజీఎఫ్ తొలి భాగం తరువాత యష్ రేంజే మారిపోయింది. పెద్ద పెద్ద బ్రాండ్‌లు కూడా యష్ వెంటపడుతున్నాయి. అయితే యష్ మాత్రం తన ఇమేజ్‌, లుక్‌కు తగ్గ బ్రాండ్స్‌ను ఎంచుకొని మరి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంతో తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు యష్‌. విలన్‌ అని ఇంగ్లీష్‌లో రాసున్న హుడీని ధరించిన ఫోటోను షేర్‌ చేసిన యష్.. `ప్రతీ ఒక్కడు మరొకడి జీవితంలో విలనే.. అందుకే విలన్‌నే ఫాలో అవ్వండి` అంటూ విలన్‌ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. రఫ్‌ టఫ్‌ లుక్‌లో ఉన్న యష్ స్టిల్‌కు సూపర్‌ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Everybody is a Villain in Somebody's Life So be a VILLAIN and follow @villainlife.official #villain #heronahivillain

A post shared by Yash (@thenameisyash) on Sep 10, 2020 at 4:16am PDT

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్‌ 2 షూటింగ్ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయ్యింది. బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా సంజయ్‌ దత్‌కు క్యాన్సర్‌ అని తెలియంటం. కేజీఎఫ్‌లో సంజయ్‌కి సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పెండింగ్‌ ఉండటంతో చిత్రకరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.