బాహుబలి తరువాత అదే స్థాయిలో సంచలనాలు నమోదు చేసిన సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో హీరో యష్‌ ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్‌ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు యష్. అయితే సినిమాల్లో బిజీగా ఉంటూనే పర్సనల్‌ లైఫ్‌ మిస్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు ఈ స్టార్ హీరో.

తాజాగా తన కుమారుడి నామకరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరపుకున్నాడు. కరోనా కారణంగా ఎక్కువ మంది గెస్ట్‌లను ఆహ్వానించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీకి దూరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు యష్.

యష్‌ ఆయన భార్య ఒకప్పటి హీరోయిన్‌ రాధికలతో పాటు అది కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఇక తన కూమారుడి పేరు యాతర్వ్‌ యష్‌ అంటూ అభిమానులకు పరిచయం చేశాడు యష్. పూర్తి సాంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash) on Aug 31, 2020 at 9:32pm PDT